
Canada Pm : జస్టిన్ ట్రూడోను సామాన్యుడి నిలదీత.. నవ్వుకుంటూ వెళ్లిపోయిన ప్రధాని
ఈ వార్తాకథనం ఏంటి
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు కెనడియన్ సిటిజన్ ఝలక్ ఇచ్చాడు. ఈ మేరకు ప్రధాన మంత్రిపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ క్రమంలోనే సదరు పౌరుడి ప్రశ్నలకు జవాబు చెప్పకుండా ప్రధాని నవ్వుకుంటూ అక్కణ్నుంచి నిష్క్రమించారు.
ట్రూడో పరిపాలనా సామర్థ్యం, విధానపరమైన నిర్ణయాలపై పౌరుడు ప్రశ్నలు గుప్పించాడు. దేశాన్ని భ్రష్ఠు పట్టించారని ఆరోపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది.
ఈ నేపథ్యంలోనే సదరు వ్యక్తి ఉక్రెయిన్ ప్రస్తావన తేవడంతో ట్రూడో మెల్లగా జారుకున్నారు. శుక్రవారం ఓ కార్యక్రమంలో ట్రూడో పాల్గొన్నారు.
అనంతరం తన మద్దతుదారులతో కరచాలనం చేశారు. ఇదే సమయంలో ఓ వ్యక్తితో ట్రూడో కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో 'మీతో కరచాలనం చేయను' అని ఓ వ్యక్తి కఠోరంగా బదులిచ్చాడు.
DETAILS
మీరు పుతిన్ మాటలు ఎక్కువగా వింటున్నారు : కెనడా ప్రధాని
మీరు దేశాన్ని నాశనం చేశారు, దేశం పరువు తీశారంటూ ట్రూడోను ఉద్దేశించి బిగ్గరగా అన్నాడు. ఈ మేరకు స్పందించిన ట్రూడో ఎందుకంత కోపంగా ఉన్నారు, నేనేం చేశానంటూ ఎదురు ప్రశ్నించారు.
మీ వైఖరి వల్ల దేశంలో ఎవరైనా ఇల్లు కొనుక్కునే పరిస్థితి ఉందా, మీరు కార్బన్ పన్ను కూడా విధిస్తున్నారంటూ నిలదీశాడు.
కార్బన్ ట్యాక్స్‌తో ఏం చేస్తున్నానో మీకు తెలుసు కదా, ఆ పన్నుల మొత్తాన్ని ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నామని సర్దిచెప్పేందుకు యత్నించారు.
సదరు పౌరుడు మాత్రం ట్రూడో మాటలు పట్టించుకోకుండా మీరు ఆ మొత్తాన్ని ఉక్రెయిన్‌కు తరలిస్తున్నారని విమర్శించారు.
మీరు పుతిన్ మాటలు ఎక్కువగా వింటున్నారంటూ నవ్వుతూ అక్కణ్నుంచి వెళ్లిపోయారు ట్రూడో.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రధాన మంత్రిని నిలదీసిన కెనడియన్
Trudeau gets confronted by a Toronto mans: "I'm not shaking your hand... you f*cked up this entire country".
— Efrain Flores Monsanto 🇨🇦🚛 (@realmonsanto) October 5, 2023
What do you think? pic.twitter.com/rvQux8VScn