సిడ్నీలో క్వాడ్ సమ్మిట్‌ను రద్దు; హిరోషిమాలో తదుపరి చర్చలు
ఈ వార్తాకథనం ఏంటి
సిడ్నీలో నిర్వహించనున్న క్వాడ్ సమ్మిట్ రద్దు అయినట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. అలాగే క్వాడ్ నాయకుల తదుపరి చర్చలు జపాన్‌లో చర్చలు జరుపుతామని ఆయన వెల్లడించారు.
రుణ పరిమితి సంక్షోభం కారణంగా క్వాడ్ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గైర్జారు అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో సిడ్నీ పర్యటనను బైడెన్ రద్దు చేసుకున్నారు.
అయితే క్వాడ్ నాయకుల చర్చలు మాత్రం తప్పకుండా జరుగుతాయని ప్రతినిధులు చెబుతున్నారు. మే 19-21 తేదీల్లో హిరోషిమాలో G-7 శిఖరాగ్ర సమావేశం జరగనుంది.
ఈ సందర్భంగా అమెరికా, భారతదేశం, జపాన్, ఆస్ట్రేలియా నాయకుల మధ్య భద్రతా, విస్తరణ, ఏకీకరణ అంశాలపై క్వాడ్ మినీ వెర్షన్‌ను నిర్వహించే అవకాశం ఉందని ఆస్ట్రేలియా ప్రధాని అభిప్రాయపడ్డారు.
ఆస్ట్రేలియా
వచ్చే వారం ఆస్ట్రేలియాకు ప్రధాని మోదీ
ఆస్ట్రేలియాను సందర్శించలేకపోతున్నందున తాను నిరాశకు గురయ్యానని బైడెన్ తనతో చెప్పారని, బదులుగా క్వాడ్ నాయకులు హిరోషిమాలో జీ7 నాయకుల సమావేశం సందర్భంగా గుమిగూడేందుకు ప్రయత్నిస్తారని అల్బనీస్ చెప్పారు.
అమెరికా ప్రెసిడెంట్ బైడెన్, జపాన్ ప్రధాని కిషిడా, భారత నరేంద్ర మోదీ, నేను శని, ఆదివారాల్లో హిరోషిమాలో జరిగే జీ7 సమావేశంలో పాల్గొననున్నట్లు వెల్లడించారు.
అయితే వచ్చే వారం ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆస్ట్రేలియాను సందర్శించే అవకాశం ఉందని అల్బనీస్ చెప్పారు. ప్రధాని మోదీ వచ్చే వారం ఇక్కడికి స్వాగత అతిథిగా వస్తారని ఆయన చెప్పారు.