Israel-Hamas: గాజా-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం.. యుద్ధం ముగిసే సూచనలు!
ఈ వార్తాకథనం ఏంటి
గాజా-ఇజ్రాయెల్ మధ్య సాగుతున్న యుద్ధం చివరికి ఆగే అవకాశాలు కనిపిస్తున్నాయి. యుఎస్,ఖతార్ మధ్యవర్తిత్వంతో రూపొందించిన కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి రావచ్చు.
ఈ ఒప్పందం ప్రకారం మొదటి దశలో హమాస్ అదుపులో ఉన్న 33 మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయనుంది.
1. హమాస్ బందీల విడుదల
హమాస్ కస్టడీలో ఉన్న 33 మంది బందీలను, వీరిలో మహిళలు, వృద్ధులు,అనారోగ్యంతో ఉన్నవారిని విడుదల చేస్తోంది. ఇది మొదటి దశగా వ్యవహరిస్తుంది. తర్వాత దశలో మిగతా బందీలపై చర్చలు నిర్వహించనున్నారు.
2. ఇజ్రాయెల్ సైనిక ఉపసంహరణ
గాజాప్రాంతంలోని కొన్ని ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరించనుంది.
ముఖ్యంగా ఫిలడెల్ఫీ కారిడార్, నెట్జారిమ్ కారిడార్ వంటి ప్రాంతాల్లో భద్రతా మార్పులు చేపట్టాలని నిర్ణయించారు.
Details
3. మానవతా సహాయం
గాజాలో పరిస్థితులు అత్యంత తీవ్రంగా ఉన్నందున మానవతా సహాయం పెంచనున్నారు.
లక్షలాది మంది పౌరులు మౌలిక వసతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ప్రతిపాదనలో తక్షణ సహాయానికి ప్రాధాన్యతనిచ్చారు.
4. గాజా పరిపాలనపై సందిగ్ధత
భవిష్యత్ గాజా పరిపాలనపై స్పష్టత లేదు. హమాస్ పాలనను ఇజ్రాయెల్ ఖండిస్తోంది. అంతర్జాతీయ సమాజం గాజా ప్రజలే పరిపాలన చేపట్టాలని భావిస్తోంది.
5. అంతర్జాతీయ ఒత్తిడి
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఒప్పందానికి తన మద్దతు ప్రకటించారు. 'ఇది మానవతా కోణంలో కీలకమైన అడుగు' అని ఆయన అభిప్రాయపడ్డారు.
Details
ఒప్పందంపై కొంతమంది అభ్యంతర వ్యక్తం
ఒప్పందం ప్రక్రియ విజయవంతమైతే గాజాలో యుద్ధం ముగియవచ్చు.
కానీ ఇజ్రాయెల్ ప్రభుత్వం లోపల కొంతమంది నేతలు ఈ ఒప్పందంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచం మొత్తం గాజా-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసే దిశగా చూస్తోంది.
ఈ ఒప్పందం శాంతి ప్రయత్నాలకు మార్గం చూపుతుందా, లేదా మధ్యలోనే విఘాతం కలుగుతుందా అనేది త్వరలో తెలియనుంది.