
China Dam: టిబెట్‌లోని బ్రహ్మపుత్ర నదిపై చైనాభారీ ప్రాజెక్టు.. భారత్‌కు ఎలాంటి ముప్పు పొంచి ఉంది?
ఈ వార్తాకథనం ఏంటి
భారత సరిహద్దుకు సమీపంలో టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రపంచంలోనే అతి భారీ జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. భారత్‌తో ప్రతి విషయంలో పోటీపడే డ్రాగన్.. సరిహద్దు ప్రాంతంలో ఈ భారీ నిర్మాణాన్ని చేపడుతుండటంతో ఇది భారత్‌కు సవాల్‌గా మారనుందా?చైనా వ్యూహాత్మకంగా ఈ ప్రాజెక్టును నిర్మించుతోందా? దీని వల్ల భారత్‌కు పెద్ద నష్టం జరిగే ప్రమాదం ఉందా?చైనా తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన దృశ్యాలను మొదటిసారి విడుదల చేయడంతో ఇవే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్న ఈ అతి భారీ జలవిద్యుత్ ప్రాజెక్టుకు 2025 జూలై 19న చైనా ప్రధాని లీ కియాంగ్ శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.14లక్షల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నఈ ప్రాజెక్టుపై భారత్‌లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
ఆది నుంచే భారత్ ఆందోళన
ఈప్రాజెక్టు ద్వారా నీటి లభ్యతపై మన దేశానికి నష్టం జరిగే అవకాశముందని,ఇరుదేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక నీటి పంపిణీ ఒప్పందం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై భారత్ ఆది నుంచే ఆందోళన వ్యక్తం చేస్తోంది.హిమాలయాల్లో టిబెట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వైపు ప్రవహించే బ్రహ్మపుత్ర నది వంకరిలో ఈడ్యాం నిర్మాణం చేపట్టబడుతోంది. ఇక్కడ భారీడ్యాం నిర్మించడం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని విమర్శలు వస్తున్నాయి. ఈప్రాజెక్టు కారణంగా అరుణాచల్ ప్రదేశ్,అస్సాం రాష్ట్రాలకు ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళన భారత్ వ్యక్తం చేసింది. రెండు దేశాల మధ్య యుద్ధ పరిస్థితి తలెత్తినప్పుడు..చైనా ఒక్కసారిగా డ్యామ్ నుండి భారీగా నీటిని విడుదల చేస్తే భారత్‌లో ముంపు ప్రమాదం తలెత్తే అవకాశం ఉంది.
వివరాలు
ఆది నుంచే భారత్ ఆందోళన
అందుకే దీనిని 'వాటర్ బాంబ్'గా అభివర్ణిస్తున్నారు. ఇక, ఎగువ ప్రాంతాల్లో ప్రాజెక్టులను నిర్మించినప్పుడు దిగువ రాష్ట్రాలకు నష్టం కలగకుండా చూసుకోవాలని భారత్ చైనా దృష్టికి ఇప్పటికే తీసుకువచ్చింది. ఇటీవల చైనాలో పర్యటించిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈ ప్రాజెక్టు అంశంపై చర్చించారు. సరిహద్దు నదుల జలాల డేటాను పరస్పరం పంచుకోవాలని, అవసరమైన విషయంలో సహకరించుకోవాలని ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ ప్రాజెక్టు వల్ల భారత్, బంగ్లాదేశ్‌లపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని చైనా పేర్కొంది. బ్రహ్మపుత్ర నదిలో భారత్‌కు అవసరమైన నీరు సకాలంలో అందుతుందని, ఉద్దేశపూర్వకంగా నీటిని నిలిపివేసినపుడే ప్రమాదం ఉంటుందని నిపుణుడు ఉత్తమ్ కుమార్ సిన్హా అభిప్రాయపడ్డారు.
వివరాలు
త్రీగోర్జెస్ డ్యాం కంటే 3 రెట్లు పెద్దది
టిబెట్‌లోని నైంగ్చీ నగరంలో చైనా ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఇది ఏటా 300 బిలియన్ కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద త్రీగోర్జెస్ డ్యాంకంటే మూడు రెట్లు పెద్దదిగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.
వివరాలు
ఇప్పటికిప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు: అస్సాం సీఎం
బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న ప్రాజెక్టు గురించి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానిస్తూ.. ఇప్పటికిప్పుడు ఎలాంటి ఇబ్బందిలేదని స్పష్టం చేశారు. ''బ్రహ్మపుత్ర నది భారత్‌లో ప్రవహించే కొద్దీ మరింత విస్తరించేది గానీ తగ్గేది కాదు. చైనా నుంచి ఈ నదికి అందే నీరు కేవలం 30 నుంచి 35 శాతమే. ఇవి మంచు కరిగిన నీటి రూపంలో, టిబెట్‌లో పడే పరిమిత వర్షాల వల్ల లభిస్తున్నవి. మిగతా 65 నుంచి 70 శాతం నీరు మాత్రం భారత్ వైపు నుంచే వస్తుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో రుతుపవనాల వలన కురిసే వర్షాలే ప్రధానంగా ఈ నదికి నీటి ఉత్పత్తి ఇస్తాయి'' అని స్పష్టం చేశారు.