సరిహద్దులో డ్రాగన్ కవ్వింపులు.. భారీగా అణ్వస్త్రాలను పోగేసుకున్న చైనా
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ - చైనా దేశాల సరిహద్దుల్లో మధ్య గత కొంతకాలంగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. దీన్ని అదనుగా తీసుకుంటున్న డ్రాగన్ దేశం భారీ ఎత్తున అణ్వస్త్రాలను (న్యూక్లియర్ వార్ హెడ్స్ ను) పెంచుకున్నట్లు సమాచారం.
అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయాలు ఇటీవలే ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే ఓ కీలక నివేదిక చైనా కత్తులు దూస్తున్న విషయాన్ని పేర్కొంది.
దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నేపథ్యంలో పలు దేశాలు ( న్యూక్లియర్ వార్ హెడ్స్ ) అణ్వస్త్రాల సంఖ్యను పోగేసుకుంటున్నట్లు స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ( సిప్రీ ) నివేదిక వెల్లడించింది. ఈ మేరకు చైనా అణ్వస్త్ర సామర్థ్యం 350 నుంచి 410కి గణనీయంగా పెరిగినట్లు వివరించింది.
DETAILS
ప్రపంచ వ్యాప్తంగా వినియోగానికి 9,576 అణు ఆయుధాలు రెఢీ
చైనా బాటలోనే మరికొన్ని దేశాలు ఈ అణ్వస్త్ర ఆయుధాలను ఆధునికీకరించుకుంటున్నాయని సిప్రీ డైరెక్టర్ డ్యాన్ స్మిత్ తెలిపారు. కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా తగ్గిన అణు ఆయుధాల సంఖ్య ఇప్పుడు మళ్లీ పెరుగుతుండటం అంతర్జాతీయ సమాజంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న తొమ్మిది దేశాలు జాబితా ఇదే :
బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, భారత్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా, పాకిస్థాన్, రష్యా, అమెరికా. 2023 నాటికి ఈ అణ్వస్త్ర దేశాలన్నింటి వద్ద దాదాపుగా 12,512 అణు ఆయుధాలు ఉన్నాయని ఆయన వివరించారు.
గతేడాది ఈ సంఖ్య 12,710గా ఉందన్నారు. అయితే వీటిలో 9,576 మాత్రమే సైనిక భాండాగారాల్లో వినియోగానికి సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.