Page Loader
China: అమెరికా వస్తువులపై 84% ప్రతీకార సుంకం: చైనా 
అమెరికా వస్తువులపై 84% ప్రతీకార సుంకం: చైనా

China: అమెరికా వస్తువులపై 84% ప్రతీకార సుంకం: చైనా 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 09, 2025
05:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ట్రేడ్‌ యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన చర్యలకు చైనా కూడా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తోంది. ట్రంప్ చైనా దిగుమతులపై 104శాతం దిగుమతి సుంకాన్నివిధించడంతో, బీజింగ్ కూడా అమెరికా వస్తువులపై 84శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించింది.ఈ కొత్త సుంకాలు ఏప్రిల్ 10 నుండి అమలులోకి రానున్నాయి. ఇటీవల అమెరికా, చైనా దిగుమతులపై ప్రతీకారంగా అధిక సుంకాలు విధించడంతో, చైనా కూడా అదే తీరులో స్పందించింది. అమెరికా నుంచి వచ్చే వస్తువులపై అదనంగా 34శాతం దిగుమతి సుంకాన్ని చైనా విధించేందుకు నిర్ణయించింది. దీని ఫలితంగా ట్రంప్ తీవ్రంగా స్పందించి,ఏప్రిల్ 8 లోపు చైనా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. లేదంటే మరో 50శాతం అదనపు సుంకాన్ని విధిస్తానని హెచ్చరిక జారీ చేశారు.

వివరాలు 

అమెరికా విధించిన మొత్తం సుంకం 104శాతం 

చైనా స్పందించకపోవడంతో ట్రంప్ తన హెచ్చరికను అమలు చేసి, ఇంతకుముందు విధించిన 54 శాతం సుంకానికి తోడు మరో 50 శాతం జోడించారు. ఈ చర్యలతో చైనాపై అమెరికా విధించిన మొత్తం సుంకం 104 శాతానికి చేరుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమెరికా వస్తువులపై 84% ప్రతీకార సుంకం