Page Loader
Faster than airplane: చైనాలో విమానంతో పోటీపడే రైలు.. 1200 కిలోమీటర్లు కేవలం 150 నిమిషాల్లో..
చైనాలో విమానంతో పోటీపడే రైలు.. 1200 కిలోమీటర్లు కేవలం 150 నిమిషాల్లో..

Faster than airplane: చైనాలో విమానంతో పోటీపడే రైలు.. 1200 కిలోమీటర్లు కేవలం 150 నిమిషాల్లో..

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 14, 2025
09:07 am

ఈ వార్తాకథనం ఏంటి

సాంకేతిక ఆవిష్కరణల్లో ప్రపంచానికి దారి చూపుతున్న చైనా, మరోసారి సంచలనం సృష్టించింది. అనేక రంగాల్లో ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ముందుండే ఈ దేశం,ఇటీవల హైస్పీడ్ రైల్ నెట్‌వర్క్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో విమానాల వేగాన్ని మించగలిగే కొత్త రైలును పరిచయం చేసింది. బీజింగ్‌లో జరిగిన 17వ మోడ్రన్ రైల్వేస్ ఎగ్జిబిషన్ సందర్భంగా,చైనా తన తాజా మ్యాగ్లెవ్ మోడల్ ట్రైన్‌ను ప్రదర్శించింది. గంటకు గరిష్ఠంగా 600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల ఈ రైలు,కేవలం 7 సెకన్ల వ్యవధిలోనే ఆ వేగాన్ని అందుకుంటుందని అధికారులు తెలిపారు. ఇది ఉపయోగంలోకి వస్తే, బీజింగ్ నుంచి షాంఘై వరకు ఉన్న సుమారు 1200 కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం 150 నిమిషాల్లో పూర్తిచేయవచ్చని చెప్పారు.

వివరాలు 

మెగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీ ఆధారంగా పని

ప్రస్తుతం అదే దూరం ప్రయాణించేందుకు సుమారు 5 గంటల 30 నిమిషాల సమయం పడుతోంది. ఈ ట్రైన్ మెగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీ ఆధారంగా పని చేస్తుంది. ఇది వ్యతిరేక అయస్కాంత క్షేత్రాల సహాయంతో రైలును ట్రాక్‌పై తేలిపెట్టే విధంగా పనిచేస్తుంది. దీని వల్ల రైలుకు గాడితో మధ్య రేఘ పట్టుబాటు లేక, ఫ్రిక్షన్ (ఘర్షణ) గణనీయంగా తగ్గి, ఎంతో నిశ్శబ్దంగా, వేగంగా ప్రయాణించగలగడం సాధ్యమవుతుంది. ఈ సాంకేతికతను వినియోగంలోకి తీసుకొస్తే, ఇది ప్రపంచంలోనే వేగవంతమైన కమర్షియల్ ట్రైన్‌గా చరిత్ర సృష్టించనుంది. ఈ ఏడాది జూన్‌లో ఈ రైలును పరీక్షించగా, ఫలితాలు ఆశాజనకంగా ఉన్నట్లు చెబుతున్నారు. దీని బరువు సుమారు 1.1 టన్నులు కాగా, ఆకారానికి బుల్లెట్ షేప్‌లో, నాజూగ్గా రూపకల్పన చేయబడింది.

వివరాలు 

'CR450' పేరుతో కొత్త బుల్లెట్ రైలు

ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద హైస్పీడ్ రైలు వ్యవస్థ చైనాదే. 2024 చివరి నాటికి చైనా హైస్పీడ్ రైలు మార్గాల పొడవు 48వేల కిలోమీటర్లకు చేరింది. 2025లో ఈ నెట్‌వర్క్‌ను 50వేల కిలోమీటర్లకు విస్తరించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఈ గమనంలో, ఇప్పటికే 'CR450' పేరుతో కొత్త బుల్లెట్ రైలును కూడా ఆవిష్కరించింది. ఇది గంటకు 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.