Page Loader
China: చైనా, ఫ్రాన్స్ దౌత్య సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్దాం: జిన్ పింగ్ 
China: చైనా, ఫ్రాన్స్ దౌత్య సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్దాం: జిన్ పింగ్

China: చైనా, ఫ్రాన్స్ దౌత్య సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్దాం: జిన్ పింగ్ 

వ్రాసిన వారు Stalin
Jan 29, 2024
10:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత్‌లో పర్యటించిన రెండు రోజుల తర్వాత.. ఫ్రెంచ్ దేశంతో దౌత్య సంబంధాలపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. చైనా, ఫ్రాన్స్ మధ్య సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ పేర్కొన్నారు. చైనా, ఫ్రాన్స్ మధ్య దౌత్య సంబంధాలు 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజింగ్‌లో జరిగిన కార్యక్రమంలో జీ జిన్ పింగ్ ప్రసంగించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు చాలా దృఢంగా ఉన్నాయని, అయితే వాటిని ప్రోత్సహించేందుకు మరిన్ని కొత్త సానుకూల నిర్ణయాలు జరగాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

చైనా

మానవాళి అభివృద్ధికి కొత్త మార్గం అవసరం: జిన్‌పింగ్ 

ఫ్రాన్స్‌తో సంబంధాలపై చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మాట్లాడుతూ.. మానవాళి అభివృద్ధికి శాంతి, భద్రత, శ్రేయస్సు కోసం ఇరు దేశాలు కొత్త మార్గాన్ని ఆవిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఫ్రాన్స్‌తో ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి చైనా ఎప్పుడూ ఎంతో ప్రాధాన్యతనిస్తుందన్నారు. చైనా ప్రాథమిక సూత్రాలను నిలబెట్టడానికి, సంబంధాల్లో కొత్త పుంతలు తొక్కడానికి, గత విజయాలను నిర్మించడానికి, కొత్త మార్గాన్ని తెరవడానికి మాక్రాన్‌తో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తద్వారా చైనా-ఫ్రాన్స్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం భవిష్యత్తులో మరింత పటిష్టంగా తయారవుతుందని అభిప్రాయ పడ్డారు.

చైనా

భారత్‌- ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఆందోళనలో చైనా

ఫ్రాన్స్‌తో సంబంధాలకు చైనా ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. దీనికి ఒక ప్రధాన కారణం ఉంది భారత్‌కు పారిస్ కీలకమైన రక్షణ భాగస్వామిగా ఉంది. ఈ క్రమంలో మాక్రాన్ భారత పర్యటనపై బీజింగ్ చాలా ఫోకస్ పెట్టింది. అలాగే మక్రాన్ భారత పర్యటనలో ఇరు దేశాలు రక్షణ రోడ్‌మ్యాప్‌ను ప్రకటించాయి. అంతేకాకుండా హిందూ మహాసముద్రం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. భారత్‌- ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడుతున్న పరిణామం చైనాకు ఆందోళన కలిగిస్తుంది.