మా అభివృద్ధిని అడ్డుకునేందుకు అమెరికా ప్రయత్నం: మోదీ యూఎస్ పర్యటనపై చైనా కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం అమెరికాకు బయలుదేరిన విషయం తెలిసిందే.
మోదీ వ్యూహాత్మకంగా చేపట్టిన ఈ పర్యటనపై చైనా స్పందించింది. అమెరికా వలలో భారత్ పడొద్దంటూ ప్రవచనాలు వల్లించే ప్రయత్నం చేసింది.
చైనా ఆర్థిక పురోగతిని అడ్డుకునేందుకు భారత్‌ను అమెరికా ప్రోత్సహించే ప్రయత్న చేస్తోందని బీజింగ్ టాప్ దౌత్యవేత్త వాంగ్ యి పేర్కొన్నారు.
భారతదేశంతో ఆర్థిక, వాణిజ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి వాషింగ్టన్ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోందన్నారు. చైనా ఆర్థిక అభివృద్ధిని అడ్డుకోవడమే దీని ఉద్దేశం అన్నారు.
అయితే ప్రపంచంలో చైనా స్థానాన్ని భారతదేశం లేదా ఇతర ఆర్థిక వ్యవస్థలు భర్తీ చేయలేవని వాంగ్ యి స్పష్టం చేశారు.
అమెరికా
మాపై ఫోకస్ పెట్టే కంటే భారత్ - అమెరికా మధ్య సమస్యలను పరిష్కరించుకోండి: చైనా
యూపిల్ లాంటి అమెరికన్ కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టినప్పటికీ వాటికి చైనాతో విడదీయరాని అనుబంధం ఉందని వాంగ్ యి పేర్కొన్నారు.
అమెరికా, భారతదేశం ఆర్థిక, వాణిజ్య సహకారాన్ని మరింత అభివృద్ధి చేయాలనుకునే క్రమంలో వారు చైనాను లక్ష్యంగా చేసుకోవడం కంటే, రెండు దేశాల మధ్య సమస్యలను పరిష్కరించుకోవాలి వాంగ్ యి హితవు పలికారు.
2014లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీ అమెరికాకు వెళ్లడం ఇది ఆరోసారి. అయితే అమెరికా ప్రభుత్వం మోదీని అధికారికంగా ఆహ్వానించడం ఇది మొదటిసారి.
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇటీవల బీజింగ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్, వాంగ్ యిలను కలిశారు.