LOADING...
China WW2 Parade: బీజింగ్‌లో విక్టరీ డే.. అత్యాధునిక క్షిపణులతో చైనా శక్తి ప్రదర్శన!
బీజింగ్‌లో విక్టరీ డే.. అత్యాధునిక క్షిపణులతో చైనా శక్తి ప్రదర్శన!

China WW2 Parade: బీజింగ్‌లో విక్టరీ డే.. అత్యాధునిక క్షిపణులతో చైనా శక్తి ప్రదర్శన!

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2025
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ వ్యాప్తంగా క్షిపణుల తయారీలో వేగంగా దూసుకుపోతున్న చైనా, రాబోయే నెలలో జరగనున్న రెండో ప్రపంచ యుద్ధ విజయోత్సవ (WW2 Victory Day Parade) కార్యక్రమానికి ప్రత్యేక సన్నాహాలు చేస్తోంది. బీజింగ్‌లో సెప్టెంబర్‌ 3న నిర్వహించనున్న ఈ పరేడ్‌లో చైనా తన అత్యాధునిక ఆయుధాలను ఆవిష్కరించబోతోందని అక్కడి మీడియా వెల్లడించింది. ఈ వేడుకలో వందలాది పీఎల్‌ఏ (PLA) సైనికులు,ఆధునిక ఫైటర్‌ జెట్లు,బాంబర్లు,ఇంకా ఇతర రక్షణ పరికరాలు ప్రదర్శనలో భాగం కానున్నాయని చైనా రక్షణ అధికారులు ధృవీకరించారు. ముఖ్యంగా,ఈ పరేడ్‌లో ప్రదర్శించనున్న అన్ని ఆయుధాలు స్వదేశీ సాంకేతికతతో తయారు చేసినవేనని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. దాదాపు 70నిమిషాల పాటు కొనసాగే ఈ ప్రదర్శనలో 45వేర్వేరు కంటింజెంట్లు పాల్గొనగా, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్వయంగా హాజరుకానున్నారు.

వివరాలు 

వైజే సిరీస్‌ (YJ series) లోని 15, 17, 19, 20 మోడళ్లు

ఈ పరేడ్‌లో ముఖ్య ఆకర్షణగా పలు కొత్త తరహా క్షిపణులు ఉండనున్నాయని సమాచారం. వీటిలో వైజే సిరీస్‌ (YJ series) లోని 15, 17, 19, 20 మోడళ్లు ప్రదర్శించబడతాయని అంచనా. ఈ సిరీస్‌లోని క్రూయిజ్‌ మిసైళ్లను భూమి, గగనం, నౌకలు, సబ్‌మెరైన్ల నుంచి ప్రయోగించే విధంగా రూపొందించారు. అందులో వైజే-15ను సూపర్‌సోనిక్ యాంటీ-షిప్‌ మిసైల్‌గా పరిగణిస్తున్నారు. ఇప్పటికే వీటి డిజైన్ చిత్రాలు వెలుగులోకి రావడంతో, ఆన్‌లైన్‌ వేదికల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీజింగ్‌లో విక్టరీ డే.. అత్యాధునిక క్షిపణులతో చైనా శక్తి ప్రదర్శన!