China: 450 కిలోమీటర్ల వేగంతో చైనా కొత్త బుల్లెట్ రైలు ఆవిష్కరణ
ఈ వార్తాకథనం ఏంటి
చైనా వరుసగా కొత్త ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేస్తోంది.
తాజాగా గంటకు అత్యధికంగా 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల బుల్లెట్ రైలును ప్రారంభించింది. దీనిని సీఆర్450గా పిలుస్తారు.
ఆదివారం బీజింగ్‌లో దీనిని పరీక్షించారు. ఈ రైలులో వినియోగించిన డిజైన్ చాలా సన్నగా, బుల్లెట్ షేప్ ముక్కతో ఉంటుంది. దీనికి అత్యధికంగా గంటకు 450 కిలోమీటర్ల వేగాన్ని అందించే సామర్థ్యం ఉంది.
దీనిని సాధారణ రైలు ప్రయాణంతో పోల్చితే, బీజింగ్ నుంచి షాంఘైకి కేవలం 2.5 గంటల్లోనే చేరవచ్చు. ఇది గతంలో నాలుగు గంటలు తీసుకునేది.
ప్రస్తుతం చైనాలో ఉన్న హైస్పీడ్ రైలు వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్దది, మొత్తం 45,000 కిలోమీటర్ల మేర విస్తరించింది.
Details
14వ పంచవర్ష ప్రణాళికలో ఈ ప్రాజెక్టు
ఈ ప్రాజెక్టు 14వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా చేపట్టారు, ఇందులో హైస్పీడ్ రైళ్లు, వంతెనలు, ట్రాక్‌లు, సొరంగాలు నిర్మిస్తారు. సీఆర్450 రైలుకు బాడీ బరువు కేవలం 10 టన్నులుగా ఉంటుంది.
ఇది గత మోడల్ కంటే 12 శాతం తక్కువ. ఇది విద్యుత్తును కూడా 20 శాతం తక్కువగా ఉపయోగిస్తుంది. ఈ రైలు గత మోడల్ కంటే 50 కిలోమీటర్ల అదనంగా అధిక వేగంతో ప్రయాణించగలదు.
ఇంజిన్ పరీక్షల్లో, ఈ రైలు గరిష్టంగా గంటకు 453 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. చైనా ఇటీవలే జె-36 అనే కొత్త యుద్ధ విమానాన్ని కూడా ఆవిష్కరించింది, ఇది ఎఫ్-35, ఎఫ్-22 రాప్టర్లకు సవాల్ విసురుతున్నట్లు సమాచారం.