
Bill Hagerty: భారత సైనికులపై చైనా ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఆయుధ ప్రయోగం.. సంచలన వ్యాఖ్యలు చేసిన అమెరికా సెనేటర్ బిల్ హ్యాగెర్టీ
ఈ వార్తాకథనం ఏంటి
భారత-చైనా సరిహద్దులో ఐదేళ్ల క్రితం చోటుచేసుకున్న ఘర్షణలో చైనా అత్యంత ప్రమాదకరమైన ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఆయుధాన్ని ఉపయోగించిందని అమెరికాకు చెందిన రిపబ్లికన్ పార్టీ సీనేటర్ బిల్ హ్యాగెర్టీ సంచలన ఆరోపణలు చేశారు. భారత సైనికులను కరిగించేందుకు విద్యుదయస్కాంత ఆయుధాలను చైనా వినియోగించిందని ఆయన పేర్కొనడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. టెన్నెస్సీ రాష్ట్రాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న హ్యాగెర్టీ, ఈ చర్య 2020లో జరిగిన గల్వాన్ లోయ ఘర్షణల నేపథ్యంలో జరిగి ఉండవచ్చని పరోక్షంగా సూచించారు. అయితే,ఆయన గల్వాన్ లోయను నేరుగా ప్రస్తావించలేదు.
వివరాలు
మోదీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత తెరపైకి వచ్చిన ఆరోపణలు
"చైనా-భారత్ సంబంధాల్లో చాలా కాలం నుంచీ వివాదాలు, అపనమ్మకాలు ఉన్నాయి. సరిహద్దులో ఐదేళ్ల క్రితం జరిగిన ఘర్షణలో భాగంగా చైనా భారత సైనికులను నష్టపరిచేందుకు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఆయుధాన్ని ఉపయోగించింది" అని తెలిపారు. ఈ నెలలో టియాంజిన్‌లో నిర్వహించబడిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమావేశమైన రెండు వారాలకే హ్యాగెర్టీ ఈ సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం.