Page Loader
అగ్రరాజ్యాన్ని కవ్విస్తున్న చైనా.. అమెరికా బాంబర్‌కు అతి సమీపంగా చైనా ఫైటర్‌ జెట్‌
అగ్రరాజ్యాన్ని కవ్విస్తున్న చైనా.. అమెరికా బాంబర్‌కు అతి సమీపంగా చైనా ఫైటర్‌ జెట్‌

అగ్రరాజ్యాన్ని కవ్విస్తున్న చైనా.. అమెరికా బాంబర్‌కు అతి సమీపంగా చైనా ఫైటర్‌ జెట్‌

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 27, 2023
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

అగ్రరాజ్యం అమెరికాను చైనా కవ్విస్తోంది. ఈ మేరకు అమెరికా బాంబర్‌కు అతి సమీపంలోకి చైనా ఫైటర్‌ జెట్‌ వచ్చింది. కేవలం 10 అడుగుల దూరంలోకి దూసుకొచ్చింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దక్షిణ చైనా సముద్రం సార్వభౌమత్వానికి సంబంధించి అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే డ్రాగన్‌ దేశం, అమెరికాపై కవ్వింపులకు పాల్పడుతోంది. దక్షిణ చైనా సముద్రం మీదుగా అమెరికా యుద్ధ విమానానికి అతి సమీపంలోకి చైనా జెట్ దూకుడుగా ప్రయాణించిందని యూఎస్ మిలిటరీ వెల్లడించింది. చైనా పైలట్‌ చర్య, రెండు విమానాలను ప్రమాదంలోకి నెట్టేసిందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు ఈ ఘటనపై యూఎస్‌ ఇండో-పసిఫిక్‌ కమాండ్‌ తాజాగా మరో ప్రకటన విడుదల చేసింది.

DETAILS

2 ఏళ్లలోనే దాదాపు 180 సార్లకుపైగా చైనా ఇటువంటి పనులే చేసింది : అమెరికా

రాత్రి వేళ షెన్యాంగ్‌ జే-11 ట్విటన్‌ ఇంజిన్‌ యుద్ధ విమానం, బీ-52 బాంబర్‌ (B-52 bomber) యుద్ధ విమానానికి కేవలం 10 అడుగుల దూరంలోనే ఉందని పేర్కొంది. విమానాన్ని ఢీకొట్టేలా చేసిన చర్యలు చైనా పైలట్‌కు తెలియకపోవడం ఆందోళనకరమని వివరించింది. దక్షిణ చైనా సముద్రంపై అంతర్జాతీయ గగనతలంలో నిబంధనల మేరకు బీ-52 కార్యకలాపాలు నిర్వహిస్తోందని, ఈ సమయంలో జే-11 యుద్ధ విమానం దూసుకొచ్చినట్లు తెలిపింది. గడిచిన 2 ఏళ్లలోనే దాదాపు 180 సార్లకుపైగా చైనా ఇటువంటి ఘటనలకు పాల్పడిందని గుర్తు చేసింది. గతంలో యుద్ధ విమానాలు ఎప్పుడూ ఇంత దగ్గరగా రాలేదన్న అమెరికా, తాజా ఘటనతో తృటిలో విమానాలు ఢీకొనే ముప్పు తప్పిందని స్పష్టం చేసింది.