Pakistan clashes : పాకిస్థాన్‌లో సున్నీ-షియా ఘర్షణ.. 11 మంది మృతి
పాకిస్థాన్‌లో మరోసారి సున్నీ, షియా ముస్లిముల మధ్య ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతను రేపాయి. ఈసారి జరిగిన ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎనిమింది మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘర్షణలు ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌లోని కుర్రమ్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. శనివారం ఉదయం ఒక వర్గానికి చెందిన వ్యక్తులపై మరొక వర్గం కాల్పులు జరపడంతో పరిస్థితి అదుపు తప్పి ఘర్షణలకు దారి తీసింది.
25 మంది మృతి
స్థానిక పోలీసుల హస్తక్షేపంతో రెండు వర్గాల మధ్య ఉన్న గొడవను చెదరగొట్టి, కర్ఫ్యూ విధించారు. ఈ ఘర్షణల్లో భాగంగా పలు ప్రాంతాల్లో వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. గతంలో కూడా ఇలాంటి ఘర్షణలు పాక్‌లో చోటు చేసుకున్నాయి. గత నెలలో ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన అల్లర్లలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుండటంతో అక్కడి సామాజిక వాతావరణం అశాంతిగా మారింది. ప్రజలలో తీవ్ర ఆందోళన నెలకొంది.