US Deportation: టారిఫ్ యుద్ధం, ట్రంప్ ఆంక్షల బెదిరింపుల మధ్య వెనక్కి తగ్గిన కొలంబియా
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తూ, ప్రత్యేక విమానాల్లో వారిని స్వదేశాలకు పంపించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ చర్యలను ముందుగా వ్యతిరేకించిన కొలంబియా, తరువాత అమెరికా విధించిన నిబంధనలకు అంగీకరించిందని వైట్ హౌస్ తెలిపింది.
కొలంబియా తన దేశానికి తిరిగి వచ్చిన పౌరులను స్వాగతించడం ఆహ్వానించడంతో , అమెరికా ఆ దేశంపై విధించిన సుంకాలు, వివిధ ఆంక్షలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.
"అమెరికా సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. యూఎస్‌లో చట్టవిరుద్ధంగా ఆశ్రయం పొందుతున్న తమ పౌరులను తిరిగి స్వదేశాలకు పంపించడానికి ప్రపంచ దేశాలు తగిన చర్యలు తీసుకోవాలి," అని వైట్ హౌస్ పేర్కొంది.
వివరాలు
అమెరికా సైనిక విమానాలను వెనక్కి పంపించిన కొలంబియా
అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులను ప్రత్యేక విమానాల్లో స్వదేశాలకు పంపించేందుకు అనుసరిస్తున్న విధానంపై పలు దేశాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ విధానాన్ని కొలంబియా కూడా అంగీకరించలేదు, వారి దేశంలో అమెరికా వలసదారులను తీసుకొచ్చే విమానాలను అనుమతించమని స్పష్టం చేసింది.
"కొలంబియా, అమెరికా వలసదారులను తీసుకువచ్చే విమానాలకు తమ దేశంలో ప్రవేశం నిరోధిస్తోంది," అని దేశాధ్యక్షుడు గుస్తావో పెట్రో ఇటీవల పేర్కొన్నారు.
వారు అమెరికా సైనిక విమానాలను కూడా వెనక్కి పంపించారు.
"వలసదారులను గౌరవంగా పంపించే ప్రక్రియ ద్వారా అమెరికా నిబంధనలు రూపొందిస్తేనే వాటిని అనుమతిస్తాం," అని పెట్రో వెల్లడించారు.
వివరాలు
అమెరికా అనుసరిస్తున్న విధానంపై బ్రెజిల్ తీవ్ర ఆగ్రహం
ఈ చర్యపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలంబియా ఉత్పత్తులపై సుంకాలు 50 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు.
కొలంబియన్ అధికారుల వీసాలను వెంటనే రద్దు చేస్తామని, వారు ఎప్పటికీ తమపై ఆధిపత్యం చెలాయించలేరని అన్నారు.
ఈ చర్యలు కేవలం ప్రారంభమేనని, ప్రపంచ దేశాలు తమ పౌరులను తిరిగి స్వదేశాలకు పంపించేందుకు తగిన చర్యలు తీసుకోకపోతే, మరిన్ని సుంకాలు విధిస్తామని హెచ్చరించారు.
మరోవైపు, బ్రెజిల్ కూడా అమెరికా అనుసరిస్తున్న విధానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వలసదారులను సంకెళ్లతో పంపించడం హక్కుల ఉల్లంఘన అని వారు భావించారు.