Page Loader
Operation Sindoor: భారత్ దాడులతో కలకలం.. పాక్ ఎయిర్ స్పేస్ మూసివేత
భారత్ దాడులతో కలకలం.. పాక్ ఎయిర్ స్పేస్ మూసివేత

Operation Sindoor: భారత్ దాడులతో కలకలం.. పాక్ ఎయిర్ స్పేస్ మూసివేత

వ్రాసిన వారు Jayachandra Akuri
May 10, 2025
08:07 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్, పాకిస్తాన్‌పై విస్తృత స్థాయిలో ప్రతీకార దాడులు చేస్తూ తీవ్రమైన విధ్వంసం సృష్టిస్తోంది. శుక్రవారం పాక్ డ్రోన్ దాడులకు గట్టి బదులుగా భారత్ శనివారం పాక్ మిలిటరీ ప్రధాన కేంద్రం రావల్పిండిని లక్ష్యంగా తీసుకుంది. రావల్పిండిలోని అత్యంత కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌పై భారత్ భారీ స్థాయిలో దాడి చేసింది. ఇది మాత్రమే కాకుండా, షార్కోట్‌లోని రఫీకి ఎయిర్ బేస్, చక్వాల్ సమీపంలోని మురిద్ ఎయిర్ బేస్‌లపై కూడా భారత్ విరుచుకుపడింది. రావల్పిండితో పాటు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోనూ పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. భారత దాడులు రావల్పిండిలోని రెండు ప్రధాన మిలిటరీ స్థావరాలపై జరిగినట్లు తెలుస్తోంది.

Details

భారత్ దాడుల్ని ధ్రువీకరించిన భారత్

భారత దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్మీ ఈ విషయాన్ని ధృవీకరించింది. అంతేకాదు, భారత్ దాడులకు తాము ప్రతీకారం తప్పకుండా తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇక లాహోర్, సియాల్ కోట్‌లలో కూడా భారత్ మిలిటరీ టార్గెట్లపై దాడులు నిర్వహించింది. ముఖ్యంగా లాహోర్‌లోని పాక్ ఆర్మీ డివిజన్‌ను లక్ష్యంగా తీసుకుని దాడులు చేసింది. ఆ డివిజన్ నుంచి సైనిక వాహనాలు బయటకు వస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది.

Details

 పాక్ ఎయిర్ బేస్‌లలోని ముఖ్యమైన సౌకర్యాలు ధ్వంసం

"నోటమ్" జారీ చేస్తూ మద్యాహ్నం 12 గంటల వరకు అన్ని దేశీయ, అంతర్జాతీయ విమానాలకు ఎయిర్ స్పేస్‌ను నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అబుదాబి నుంచి పెషావర్ వెళ్తున్న పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని క్వెట్టాకు మళ్లించాల్సి వచ్చింది. భారత్ దాడుల్లో పాక్ ఎయిర్ బేస్‌లలోని ముఖ్యమైన సౌకర్యాలు పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఫలితంగా పాక్ ఫైటర్ జెట్లు ఎగరలేని స్థితికి చేరుకున్నట్లు సమాచారం. ఈ దాడులతో భారత వైమానిక శక్తి మరోసారి తన సామర్థ్యాన్ని ప్రదర్శించింది.