
Corona: అమెరికాలో మళ్లీ కరోనా విజృంభణ.. 25 రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల!
ఈ వార్తాకథనం ఏంటి
అంతరించి పోయిందనుకున్న కోవిడ్ మళ్లీ పెరుగుతోంది. ఈ మహమ్మారి అమెరికాలో మళ్లీ విజృంభిస్తుంది. తాజాగా వచ్చిన CDC (సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) వారం వారం నివేదిక ప్రకారం.. 25 రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నట్లు తేలింది. ముఖ్యంగా దక్షిణ, ఆగ్నేయ, పశ్చిమ తీర ప్రాంతాల్లో ఈ పెరుగుదల ఎక్కువగా ఉంది. అంతేకాక పసిఫిక్ నార్త్‌వెస్ట్, ఆగ్నేయ భాగాల్లో ఎమర్జెన్సీ విభాగాల్లో రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆరోగ్య విభాగం వెల్లడించింది. ఈ పెరుగుదల ఫిబ్రవరి, మార్చి తర్వాత అత్యధికంగా ఉందని అధికారులు చెబుతున్నారు. దీనికితోడు కొత్త వేరియంట్లు రావడం వల్ల ఈ పెరుగుదల చోటు చేసుకుంటోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Details
గతవారం నుంచి గణనీయంగా పెరిగినట్లు సమాచారం
CDC విశ్లేషణ ప్రకారం, కోవిడ్ ప్రతి సంవత్సరం రెండు సార్లు పీక్స్‌కు చేరుకుంటుందని, వాటిలో వేసవి (జూలై-సెప్టెంబర్), శీతాకాలం (డిసెంబర్-ఫిబ్రవరి) ముఖ్యమని చెబుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్-19 యాక్టివిటీ స్థాయి తక్కువగా ఉన్నా, గత వారం గణనీయంగా పెరిగినట్లు డేటా చెబుతోంది. ఈ నేపథ్యంలో అధికంగా కేసులు ఉన్న రాష్ట్రాల్లో కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అమలు చేస్తున్నాయి. ప్రజలు మళ్లీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.