
Operation Sindoor: డ్రోన్ దాడులకు కౌంటర్ అటాక్.. పాక్ ఎయిర్ బేస్‌లపై భారత్ దాడులు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ మరోసారి పాకిస్తాన్‌పై ఘాటుగా ప్రతీకారం తీర్చుకుంది. శుక్రవారం సాయంత్రం పాకిస్థాన్ డ్రోన్లతో భారతీయ నగరాలపై దాడికి తెగబడింది.
ప్రతీకారంగా భారతదేశం శనివారం తెల్లవారుజామున భారీ స్థాయిలో పాక్‌పై ప్రతిదాడికి దిగింది.
ముఖ్యంగా పాకిస్తాన్ మిలిటరీ ప్రధాన కేంద్రమైన రావల్పిండిని లక్ష్యంగా చేసుకుని భారత్ బాలిస్టిక్ మిస్సైళ్లు, డ్రోన్లతో దాడులు జరిపినట్లు సమాచారం.
ఈ దాడుల్లో పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన కీలక ఎయిర్ బేసులే లక్ష్యంగా మారాయి.
రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్, షార్కోట్‌లోని రఫీకి ఎయిర్‌బేస్, చక్వాల్ సమీపంలోని మురిద్ ఎయిర్‌బేస్‌లపై భారత్ తీవ్రంగా విరుచుకుపడింది. ఈ దాడుల దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Details
దాడులను ధ్రువీకరించిన పాక్
పాక్ మీడియా వర్గాలు కూడా భారత దాడుల్ని ధృవీకరించాయి. పాకిస్తాన్ సైన్యం అధికార మీడియా విభాగమైన ఐఎస్‌పీఆర్ ఈ దాడులను అధికారికంగా గుర్తించింది.
కేవలం రావల్పిండినే కాకుండా, లాహోర్, ఇస్లామాబాద్, సియాల్ కోట్, నర్వాల్ నగరాల్లో కూడా భారత్ విస్తృత స్థాయిలో దాడులు చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల పాకిస్తాన్ డ్రోన్ల ద్వారా భారత్‌ను పదే పదే టార్గెట్ చేయడం కారణంగా ఈ ఎయిర్‌బేసులపై దాడులు జరిపినట్లు తెలుస్తోంది.
రావల్పిండిలోని రెండు మిలిటరీ స్థావరాలపై పెద్ద మొత్తంలో దాడులు జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్‌ను మూసివేసినట్టు తెలుస్తోంది. లాహోర్‌లో 10, 11వ బెటాలియన్‌లపై కూడా దాడులు జరిగాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పాక్ పై ప్రతీకార దాడులు
#BREAKING: Multiple explosions heard at Noor Khan Air Base of Pakistan Air Force in Rawalpindi - Headquarters of the Pakistan Army. Tit for Tat action by India after Pakistan Army launched attack on India Air bases and Military Stations. pic.twitter.com/L1MqRsMY9Q
— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 9, 2025