Loading...
Cyberattacks on Ships: 50 వాణిజ్య నౌకలపై సైబర్ దాడులు.. రంగంలోకి దిగిన అమెరికా!
50 వాణిజ్య నౌకలపై సైబర్ దాడులు.. రంగంలోకి దిగిన అమెరికా!

Cyberattacks on Ships: 50 వాణిజ్య నౌకలపై సైబర్ దాడులు.. రంగంలోకి దిగిన అమెరికా!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2026
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటివరకు సైనిక, దౌత్యపరమైన అంశాలకే పరిమితమైన ఈ వివాదం ఇప్పుడు అంతర్జాతీయ సముద్ర వాణిజ్య రంగానికీ విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. చమురు, సహజ వాయువు, రసాయనాలు వంటి కీలక సరుకులను రవాణా చేసే సుమారు 50 వాణిజ్య నౌకలపై సైబర్ దాడులు జరిగినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో వెల్లడించింది. ఈ దాడుల వెనుక ఇరాన్ ప్రమేయం ఉందా అనే కోణంలో అమెరికా దర్యాప్తు చేపట్టింది. అయితే, ఇప్పటివరకు ఈ సైబర్ దాడులకు పాల్పడినవారెవరనేది స్పష్టంగా తెలియలేదు. మరోవైపు రష్యా ప్రమేయం ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు వివిధ కోణాల్లో ఆధారాలను పరిశీలిస్తున్నాయి.

వివరాలు 

కొన్ని నౌకలకు బాంబు బెదిరింపులు.. డబ్బులు చెల్లించాలంటూ సందేశాలు

దాడులకు గురైన కొన్ని నౌకలకు బాంబు బెదిరింపులు రావడంతో పాటు, డబ్బులు చెల్లించాలంటూ సందేశాలు పంపినట్లు సమాచారం.

అమెరికా ఉత్పత్తులను రవాణా చేయవద్దని హెచ్చరిస్తూ మరికొన్ని సందేశాలు వచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఇంకొన్ని నౌకల కంప్యూటర్ నెట్‌వర్క్‌లలో సిబ్బందికి తెలియకుండానే హ్యాకర్లు చొరబడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన అమెరికా కోస్ట్ గార్డ్.. ఆ దేశ తీరానికి సమీపంలో ఉన్న కనీసం నాలుగు నౌకల వద్ద ప్రత్యేక సైబర్ భద్రతా బృందాలను మోహరించింది.

VL Prosperity, Kohaku అనే నౌకల్లోనూ తనిఖీలు చేపట్టినట్లు నివేదిక పేర్కొంది.

వివరాలు 

ఫోర్టినెట్ పరికరాలే హ్యాకర్లకు మార్గమా?

నౌకా రవాణా సంస్థలు ఉపయోగించే ఫోర్టినెట్ నెట్‌వర్క్ పరికరాల్లో ఉన్న భద్రతా లోపాలను హ్యాకర్లు తమకు అనుకూలంగా ఉపయోగించుకున్నట్లు అనుమానిస్తున్నారు.

ఈ పరికరాల ద్వారా నౌకల్లోని కమ్యూనికేషన్ వ్యవస్థలు, కంప్యూటర్ నెట్‌వర్క్‌లలోకి చొరబడే అవకాశం ఉంటుంది.

ఇలాంటి సైబర్ దాడుల వల్ల నౌకల సమాచార వ్యవస్థలు పనిచేయకుండా పోవచ్చు.

ప్రయాణాల్లో ఆలస్యం జరగడం, సరుకు రవాణాకు అంతరాయం కలగడం, కొన్ని కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.

గతంలోనూ అమెరికా సముద్ర జలాల్లోకి వచ్చిన రెండు నౌకల కంప్యూటర్ వ్యవస్థల్లో అనుమానాస్పద చొరబాట్లను అధికారులు గుర్తించారు.

దీంతో కోస్ట్ గార్డ్, ఎఫ్‌బీఐ సంయుక్తంగా తనిఖీలు చేపట్టాయి.

ADVERTISEMENT

వివరాలు 

చమురు,గ్యాస్ సరఫరాపై ప్రభావం పడే అవకాశం

ఈ సైబర్ దాడుల వ్యవహారం గల్ఫ్ ప్రాంతంలోని పోర్టులు,చమురు టెర్మినళ్లు,అంతర్జాతీయ సముద్ర రవాణా భద్రతపై ఆందోళన కలిగిస్తోంది.

ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధి వద్ద భద్రతా తనిఖీలు పెరిగితే నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది.

దీంతో చమురు, ఎల్పీజీ సరఫరాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

అంతేకాకుండా నౌకలకు సంబంధించిన బీమా ప్రీమియంలు,సరుకు రవాణా ఛార్జీలు కూడా పెరగవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

చమురు,గ్యాస్ సరఫరాపై ప్రభావం పడే అవకాశం

ఇప్పటికే అంతర్జాతీయంగా కీలకమైన సముద్ర మార్గాల భద్రతపై చర్చ జరుగుతున్న వేళ ఈ పరిణామాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరోవైపు సైబర్ దాడులకు బాధ్యులెవరనే విషయాన్ని గుర్తించేందుకు అమెరికా దర్యాప్తు కొనసాగిస్తోంది.

ఈ దాడుల వెనుక ఇరాన్ లేదా రష్యా ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు బయటపడితే అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది.

ADVERTISEMENT