LOADING...
Data Privacy: వినియోగదారుల లైంగిక చర్యలను ట్రాక్ చేస్తున్న కార్లు  
Data Privacy: వినియోగదారుల లైంగిక చర్యలను ట్రాక్ చేస్తున్న కార్లు

Data Privacy: వినియోగదారుల లైంగిక చర్యలను ట్రాక్ చేస్తున్న కార్లు  

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 07, 2023
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ బ్రాండ్‌లు డిజిటల్‌మయంగా మారుతున్న తరుణంలో డేటా ప్రైవసీపై ప్రముఖ సంస్థ బుధవారం ఆందోళనకర విషయాలు వెల్లడించింది. కాలిఫోర్నియాకు చెందిన మొజిల్లా ఫౌండేషన్ 25 కార్ బ్రాండ్‌లను సమీక్షించింది. విటిలో ఏ కంపెనీ కూడా వినియోగదారుల గోప్యతపై సంతృప్తికరమైన ప్రమాణాలను పాటించడంలేదని తెలిపింది. సెక్స్ టాయ్‌లు లేదా మానసిక ఆరోగ్య యాప్‌ల తయారీదారులతో సహా మరే ఇతర ఉత్పత్తి వర్గానికి ఇంత పేలవమైన సమీక్ష రాలేదని తెలిపింది. కార్ల తయారీదారులు తమ కార్లను 'కంప్యూటర్ ఆన్ వీల్స్' అని గొప్పగా చెప్పుకుంటున్నారని, కానీ, ప్రముఖ కార్ల బ్రాండ్లన్నీ నెమ్మదిగా సమాచారాన్ని సేకరించే యంత్రాలుగా మారి డేటా విక్రయ బిజినెస్‌లోకి ప్రవేశించాయని మొజిల్లా పేర్కొంది.

Details 

డేటా సేకరించే విషయంలో ముందు వరుసలో టెస్లా

డేటా సేకరించే విషయంలో ముందు వరుసలో టెస్లా ఉందని, ఆ తరువాత నిస్సాన్ రెండవ స్థానంలో నిలిచిందని తెలిపింది. అయితే, వినియోగదారులలైంగిక కార్యకలాపాలతో సహా కొన్ని "గగుర్పాటు కలిగించే కేటగిరీల" డేటాను సైతం నిస్సాన్‌ సేకరించే ప్రయత్నం చేసినట్లుగా తాము గుర్తించినట్లు మొజిల్లా వెల్లడించింది. 84 శాతం కార్ బ్రాండ్‌లు వినియోగదారుల వ్యక్తిగత డేటాను సర్వీస్ ప్రొవైడర్లు, డేటా బ్రోకర్లు, ఇతర వ్యాపారులతో పంచుకునేందుకు అంగీకరించినట్లు అధ్యయనం సంస్థ కనుగొంది. వారిలో ఎక్కువ మంది అంటే 76 శాతం మంది తమ కస్టమర్ల డేటాను ఇప్పటికే విక్రయించినట్లు చెప్పారు.మరికొంతమంది ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలకు అవసరమైతే సమాచారాన్నిఅందిస్తామని చెప్పారు.

Details 

మెజారిటీ బ్రాండ్లు వినియోగదారులకు డేటాను నియంత్రించుకునే  ఆప్షన్స్ ఇవ్వడం లేదు 

నేడు ఇంటర్నెట్ కి కనెక్ట్ చేయబడిన వాహనాలు డ్రైవింగ్ సంబంధిత డేటాను మాత్రమే కాకుండా, వాహనంలోని వినోద వ్యవస్థ, శాటిలైట్ రేడియో, మ్యాప్స్ వంటి థర్డ్-పార్టీ ఫంక్షన్‌లను కూడా ట్రాక్ చేస్తున్నాయని మొజిల్లా తెలిపింది. ఫోర్డ్, చేవ్రొలెట్, టయోటా, వోక్స్‌వ్యాగన్, BMW వంటి కార్ల బ్రాండ్‌లు ఏవీ కూడా గత మూడేళ్లలో 68 శాతం డేటా లీక్‌లు, హ్యాక్‌లు లేదా ఉల్లంఘనలకు గురైనప్పుడు తమ వినియోగదారులకు డేటాను నియంత్రించుకునే ఆప్షన్లను ఇవ్వడం లేదని తెలిపింది.