
Operation Sindoor: భారత్, పాక్ ఉద్రిక్తతల వేళ ఇస్లామాబాద్‌లో సైరన్ల మోత
ఈ వార్తాకథనం ఏంటి
భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసేందుకు పాకిస్థాన్ యత్నించగా, భారత సైన్యం ధీటైన ప్రతిస్పందన ఇచ్చింది.
పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో గగనతల రక్షణ రాడార్‌లు, సంబంధిత సాంకేతిక వ్యవస్థలను భారత్ లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడికి దిగింది.
ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఆపత్కాల సైరన్లు మోగిన దృశ్యం నమోదైంది.
ఇదే సమయంలో ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతుండటం గమనార్హం.
వివరాలు
ఇస్లామాబాద్‌లో మోగిన ఆపత్కాల సైరన్లు
పహల్గాం దాడి ఘటన,ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితి తారాస్థాయికి చేరింది.
ఈ ఉద్రిక్త వాతావరణంలోనే కొన్ని గంటల క్రితం పాకిస్థాన్ ప్రధాన నగరాలైన లాహోర్, కరాచీలలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.
భారత సైన్యం పాకిస్థాన్ వైమానిక దాడుల యత్నాన్ని విజయవంతంగా తిప్పికొట్టి, లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది.
ఈ విషయాన్ని భారత రక్షణ శాఖకు చెందిన వర్గాలు వెల్లడించాయి.
ఈ దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు.
ఇందులో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో పాటు ఉన్నతస్థాయి మిలిటరీ అధికారులు పాల్గొన్నారు.
సమావేశం జరుగుతున్న సమయంలో ఇస్లామాబాద్‌లో మళ్లీ ఆపత్కాల సైరన్లు మోగాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇస్లామాబాద్‌లో సైరన్ల మోత
اسلام آباد میں سائرن بجنے کی مسلسل آوازیں pic.twitter.com/mp2eQt9cbS
— Sadaf Abbasi (@Sadaf6816958217) May 8, 2025