Page Loader
Denmark: డెన్మార్క్ ప్రధాన మంత్రి మెట్టె ఫ్రెడరిక్సెన్ పై దాడి.. వ్యక్తి అరెస్టు 

Denmark: డెన్మార్క్ ప్రధాన మంత్రి మెట్టె ఫ్రెడరిక్సెన్ పై దాడి.. వ్యక్తి అరెస్టు 

వ్రాసిన వారు Stalin
Jun 08, 2024
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

సెంట్రల్ కోపెన్‌హాగన్‌లో డెన్మార్క్ ప్రధాన మంత్రి మెట్టె ఫ్రెడరిక్‌సెన్ పై శుక్రవారం ఒక వ్యక్తి దాడి చేశాడు. అయితే ఈ దాడిలో ఆమెకు ఎటువంటి హాని జరగలేదని స్థానికులు రాయిటర్స్‌తో చెప్పారు. డెన్మార్క్ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

డీటెయిల్స్ 

పోలీసుల అదుపులో దాడి చేసిన వ్యక్తి 

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో తాము ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వారు వివరించారు. అయితే మరిన్ని వివరాలను ఇవ్వడానికి నిరాకరించారు. దిగ్భ్రాంతికి గురైన యూరోపియన్ యూనియన్ ఈ సంఘటనతో మెట్టె ఫ్రెడరిక్‌సెన్ దిగ్భ్రాంతికి గురయ్యారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా యూరోపియన్ యూనియన్ ఎన్నికల ముందు ఈ దాడి జరగడంపై సభ్య దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.