Page Loader
Khalistanis Attacked Hindus: కెనడాలో మరోసారి హిందూ భక్తులపై దాడి.. ఖండించిన ట్రూడో 
కెనడాలో మరోసారి హిందూ భక్తులపై దాడి.. ఖండించిన ట్రూడో

Khalistanis Attacked Hindus: కెనడాలో మరోసారి హిందూ భక్తులపై దాడి.. ఖండించిన ట్రూడో 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2024
08:28 am

ఈ వార్తాకథనం ఏంటి

బ్రాంప్టన్‌లోని హిందూ సభా మందిర్‌లో భక్తులపై ఖలిస్తానీ వాదుల దాడి తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్రంగా ఖండించారు. దేశంలో హింసాత్మక చర్యలకు ఎటువంటి చోటు లేదని, ప్రతి కెనడియన్‌కు తమ విశ్వాసాలను స్వేచ్ఛగా, భయపెట్టే పరిస్థితులు లేకుండా ఆచరించే హక్కు ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై స్పందించి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ట్రూడో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కెనడియన్ ఎంపీల ద్వారా షేర్ చేయడంతో, వీడియో వేగంగా వైరల్ అయింది.

వివరాలు 

కర్రలతో చిన్నారులు, మహిళలపై దాడి

వీడియోలో ఖలిస్థానీ అనుకూల గ్రూపులకు చెందిన జెండాలు ప్రదర్శిస్తూ, కర్రలతో చిన్నారులు, మహిళలపై దాడి చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై స్పందించిన పీల్ ప్రాంతీయ పోలీసు చీఫ్ నిషాన్ దురైయప్ప, ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని, శాంతియుత నిరసనకు అనుమతి ఉన్నా, హింసాత్మక చర్యలు మాత్రం ఆమోదయోగ్యమవని, నేరపూరిత చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జస్టిన్ ట్రూడో చేసిన ట్వీట్ 

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హిందూ ఫోరమ్ కెనడా చేసిన ట్వీట్