Trump-Macron: 'మన మధ్య ఒప్పందం మా ప్రజలకు చెప్పకండి..' మేక్రాన్ నన్ను ప్రాధేయపడ్డారు: ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్‌ను (Emmanuel Macron) ఉద్దేశించి హేళనగా మాట్లాడారు ప్లీజ్ డొనాల్డ్ అంటూ మేక్రాన్ ప్రాధేయపడ్డారని రిపబ్లికన్ చట్టసభ సభ్యుల సమావేశంలో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు. 'ఫ్రాన్స్ ఔషధాల ధరలను మూడింతలుగా పెంచాలని మేక్రాన్‌ను అడిగాను. ఆయన తొలుత అంగీకరించలేదని చెప్పారు. ఆ తర్వాత, ఆ దేశం నుంచి దిగుమతి వస్తువులపై 25 శాతం టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించాను. దీని వల్ల మేక్రాన్ మన డిమాండ్లను అంగీకరించాల్సి వచ్చింది. అప్పుడే మేక్రాన్ మాట్లాడుతూ.. 'డొనాల్డ్, మన మధ్య ఒప్పందం ఉంది. నేను ఔషధాల ధరలను మీకావలసినంత పెంచుతాను, కానీ మా ప్రజలకు చెప్పవద్దు' అని ప్రాధేయపడ్డారు'' అంటూ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
అమెరికాలో పెరిగిన స్థానిక ఔషధాల డిమాండ్
10 డాలర్లు ఉన్న ఒక మందుబిళ్ల ధరను ఫ్రాన్స్ 30 డాలర్లకు పెంచిందన్నారు. ఫ్రాన్స్‌లో ఔషధాల ధర తక్కువగా ఉండటంతో అమెరికాలో ఎక్కువగా అమ్మకాలు జరిగేవి, దాంతో అమెరికా కంపెనీలకు నష్టం కలిగేది. ట్రంప్ సూచన మేరకు ఫ్రాన్స్ ధరలు పెంచడంతో, అమెరికాలో స్థానిక ఔషధాల డిమాండ్ పెరిగిందని వైద్య నిపుణులు విశ్లేషించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై మేక్రాన్ లేదా ఫ్రాన్స్ ప్రభుత్వం ఎటువంటి స్పందన ఇవ్వలేదు. ఇలాగే, ట్రంప్ గతంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై కూడా వ్యాఖ్యానించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌కు అమెరికా విధించిన సుంకాలపై మోదీ అంత ఆనందంగా లేరని తెలిపారు.