Page Loader
'డొనాల్డ్ ట్రంప్ నన్ను రేప్ చేశారు': న్యూయార్క్ కోర్టులో దావా వేసిన రచయిత
'డొనాల్డ్ ట్రంప్ నన్ను రేప్ చేశారు': న్యూయార్క్ కోర్టులో దావా వేసిన రచయిత

'డొనాల్డ్ ట్రంప్ నన్ను రేప్ చేశారు': న్యూయార్క్ కోర్టులో దావా వేసిన రచయిత

వ్రాసిన వారు Stalin
Apr 27, 2023
02:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

మూడు దశాబ్దాల క్రితం డొనాల్డ్ ట్రంప్ తనపై అత్యాచారం చేశారని అమెరికాకు చెందిన రచయిత జీన్ కారోల్ న్యూయార్క్ కోర్టులో దావా వేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఆమె ఇచ్చిన వాంగ్మూలం సంచలనంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ తనపై లైంగిక దాడి చేసినందు వల్లే తాను ఇక్కడ ఉన్నట్లు న్యూయార్కులోని మాన్‌హట్టన్ ఫెడరల్ కోర్టు జ్యూరీకి వివరించారు. మరోసారి అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయబోతున్న డొనాల్డ్ ట్రంప్ ఎదుర్కొంటున్న చట్టపరమైన సవాళ్లలో ఈ కేసు ఒకటి కావడం గమనార్హం. 1996లో మాన్‌హట్టన్‌లోని లగ్జరీ బెర్గ్‌డార్ఫ్ గుడ్‌మ్యాన్ డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో దుస్తులు మార్చుకునే గదిలో ట్రంప్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని 79ఏళ్ల కారోల్ ట్రంప్‌పై దావా వేశారు.

ట్రంప్

ట్రంప్ లైంగిక వేధింపులపై 2019లో తొలిసారిగా స్పందించిన కారోల్

రచయిత జీన్ కారోల్ మాన్‌హట్టన్ స్టోర్‌లో తనపై ట్రంప్ చేసిన దారుణాన్ని జ్యూరీలకు కారోల్ వివరించారు. ఓ మహిళకు లో దుస్తుల బహుమతిగా ఇవ్వాలని, కొనడానికి తనకు సలహా ఇవ్వాలని ట్రంప్ సరదాగా తనను అడిగినట్లు కారోల్ చెప్పారు. తర్వాత, ట్రంప్ డ్రెస్సింగ్ రూమ్‌లో తనపట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు పేర్కొన్నారు. 2019లో తొలిసారిగా న్యూయార్క్ మ్యాగజైన్ ప్రచురించిన వ్యాసంలో కారోల్ ఈ ఆరోపణ చేశారు. ట్రంప్‌పై ఇన్నాళ్లు ఎందుకు ఫిర్యాదు చేయలేదని జ్యూరీ అడిగిన ప్రశ్నకు కారోల్ ఈ విధంగా చెప్పారు. తాను డొనాల్డ్ ట్రంప్‌ను చూసి భయపడినట్లు చెప్పారు. అంతేకాకుండా తాను సిగ్గుపడినట్లు పేర్కొన్నారు.