తదుపరి వార్తా కథనం

Donald Trump: భారత్-పాక్ కాల్పుల విరమణను అంగీకరించాయంటూ డొనాల్డ్ ట్రంప్ పోస్టు
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 10, 2025
05:52 pm
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని తెలిపారు. ఈ నిర్ణయానికి అమెరికా పాత్ర పోషించిందని స్పష్టం చేశారు.
శనివారం సాయంత్రం తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
'అమెరికా మధ్యవర్తిత్వంతో రాత్రంతా సుదీర్ఘ చర్చలు జరిగాయి. చివరకు భారత్, పాక్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ క్లిష్ట సమయంలో ఇరు దేశాలు సహనంతో, తెలివిగా స్పందించాయి.
ఇది ప్రశంసనీయమైన నిర్ణయం. అందుకు వారి నేతలకు కృతజ్ఞతలంటూ ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. దీనిపై ఇరు దేశాలు అధికారికంగా స్పందించాల్సి ఉంది.