Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం.. 20 మంది న్యాయమూర్తుల తొలగింపు!
ఈ వార్తాకథనం ఏంటి
డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి వివరణ లేకుండా కనీసం 20 మంది ఇమ్మిగ్రేషన్ కోర్టు న్యాయమూర్తులను తొలగించారు.
అంతకుముందు ప్రమాణ స్వీకారం చేయని 13 మంది న్యాయమూర్తులు, ఐదుగురు అసిస్టెంట్ చీఫ్ ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తులు నోటీసు లేకుండానే తొలగించారని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ ఇంజనీర్స్ అధ్యక్షుడు మాథ్యూ బిగ్స్ వెల్లడించారు.
ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై వ్యతిరేకత పెరిగి కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ వ్యాజ్యాలపై ట్రంప్ స్పందించారు. ''తన దేశాన్ని కాపాడే వారు రాజ్యాంగాన్ని ఉల్లంఘించరంటూ ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే కొటేషన్‌ను ట్రూత్ సోషల్‌లో షేర్ చేశారు.
Details
పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు
ఈ ఏడాది జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్, తన ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా ముందడుగు వేశారు.
అక్రమ వలసదారులను వెనక్కి పంపడం, పుట్టుక ద్వారా పౌరసత్వానికి ముగింపు, ఆరోగ్య కారణాలతో సరిహద్దుల మూసివేత, అమెరికా-మెక్సికో గోడ నిర్మాణం, దిగుమతి వస్తువులపై భారీ సుంకాలు విధించడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Details
ట్రంప్‌కు వ్యతిరేకంగా వ్యాజ్యాలు
అక్రమ వలసదారులపై కఠిన చర్యలు, లింగమార్పిడి వ్యక్తులను అమెరికా సైన్యంలో నిషేధించే నిర్ణయాలు, ప్రభుత్వ ఉద్యోగులపై తీసుకున్న చర్యలు తీవ్ర వ్యతిరేకతకు గురయ్యాయి.
ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ కోర్టులో పలు వ్యాజ్యాలు నమోదయ్యాయి. అక్రమ వలసాల అణచివేతపై పది వ్యాజ్యాలు, జన్మతః పౌరసత్వం రద్దుపై ఏడు వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
Details
ఎఫ్‌బీఐ దర్యాప్తు, నెపోలియన్ ప్రస్తావన
జనవరి 2021 కాపిటల్ అల్లర్లపై ఎఫ్‌బీఐ దర్యాప్తులో పాల్గొన్న ఏజెంట్ల వివరాలను వెల్లడించడం కూడా విమర్శలకు దారి తీసింది. ఈ పరిణామాలపై ట్రంప్ స్పందిస్తూ, 'తన దేశాన్ని రక్షించే వారు ఎప్పుడూ చట్టాన్ని ఉల్లంఘించరని నెపోలియన్ బోనపార్టే కోట్‌ను ప్రస్తావించారు.
ఫ్రాన్స్‌లో తన నియంతృత్వ పాలనను సమర్థించేందుకు నెపోలియన్ తరచుగా ఈ కోట్‌ను వినిపించేవాడని విశ్లేషకులు గుర్తుచేశారు.
ఇక ట్రంప్ కోర్టు తీర్పులను గౌరవిస్తానని చెబుతున్నా ఆయన సలహాదారులు న్యాయమూర్తులను టార్గెట్ చేస్తూ, వారి మీద అభిశంసనకు పిలుపునిస్తున్నారు.
'కార్యనిర్వాహక వర్గ అధికారాన్ని నియంత్రించేందుకు న్యాయమూర్తులకు హక్కు లేదని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల ట్వీట్ చేశారు.