LOADING...
Donald Trump: అక్రమ చెల్లింపుల కేసు తీర్పు తన కుటుంబాన్ని బాధించింది: డొనాల్డ్ ట్రంప్
అక్రమ చెల్లింపుల కేసు తీర్పు తన కుటుంబాన్ని బాధించింది: డొనాల్డ్ ట్రంప్

Donald Trump: అక్రమ చెల్లింపుల కేసు తీర్పు తన కుటుంబాన్ని బాధించింది: డొనాల్డ్ ట్రంప్

వ్రాసిన వారు Stalin
Jun 03, 2024
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

అక్రమ చెల్లింపుల కేసు తీర్పు తన కుటుంబాన్ని ఎంతో ప్రభావితం చేసిందని US మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకున్నారు. అమెరికాలో ఇలా అభిశంసనకు గురైన మాజీ అధ్యక్షుడిగా ఆయన చరిత్ర పుటల్లో నిలవనున్నారు. కాగా తన భార్య మెలానియా ఎలా ప్రభావితం చేసిందో పంచుకున్నారు. వారాంతంలో ఒక ఇంటర్వ్యూలో తనపై వచ్చిన ఆరోపణలను ఆమె జీర్ణించుకోలేకపోయారన్నారు. కానీ అది ఆమెకు చాలా ఇబ్బందికరం,కష్టంగా మారిందని , అని ట్రంప్ ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు..

Details 

12 మంది సభ్యుల జ్యూరీ ట్రంప్ ను దోషిగా నిర్ధారించింది

అయినా ఆమె బాగానే ఉందన్నారు.77 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ జూలై 11న శిక్షను ఎదుర్కొంటారు. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో మాజీ పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు డబ్బు చెల్లింపులను దాచిపెట్టారు . దీనికి సంబంధించిన వ్యాపార పత్రాలను తప్పుడు సమాచారం అందించారని జ్యూరీ గుర్తించింది. దీనితో 12 మంది సభ్యుల జ్యూరీ ఆయన్ని దోషిగా నిర్ధారించింది. 2006లో అమెరికా మాజీ అధ్యక్షురాలు మెలానియా ట్రంప్‌ను వివాహం చేసుకున్నారు. అయినప్పటికీ ట్రంప్‌ డేనియల్స్ మధ్య లైంగిక సంబంధంపై నుండి స్పష్టమైన సాక్ష్యంఉంది. దీనిని విచారణలోగుర్తించారు.

Details 

విచారణకి మెలానియా గైర్హాజరు, ట్రంప్ మాటలపై సందేహాలు 

దీనిని డోనాల్డ్ ట్రంప్ తిప్పి కొట్టారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని డేనియల్స్‌తో ఎప్పుడూ లైంగిక సంబంధం లేదన్నారు. ఇదంతా అవకతవకలమయంగా ఉన్నదని మాజీ అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. ఈ తీర్పుపై ట్రంప్ అప్పీల్ చేస్తారని భావిస్తున్నారు. ట్రంప్ అక్రమ చెల్లింపుల కేసు కోర్టు విచారణకి మెలానియా గైర్హాజరు అయ్యారు. తాను తన భర్త పక్షాన లేనని పరోక్షంగా తెలిపారు. ఈ మేరకు ఆమె భర్త 33 నిమిషాలపాటు స్క్రిప్ట్ లేని ప్రసంగం చేసినప్పుడు ఆమె పక్కన లేరు. తీర్పు తర్వాత ఇతర కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో ఖండన సందేశాలను పోస్ట్ చేశారు. కానీ ఆన్‌లైన్‌లో ఆమె మౌనం సందేహాలను లేవనెత్తింది.

Details 

భార్య,కుమార్తె తన వైపు లేకపోవటంపై ట్రంప్ కలత 

గత నెలలో తన భార్య, కుమార్తె ఇవాంకా ట్రంప్ తన విచారణకు హాజరుకాకపోవడంతో డొనాల్డ్ "పూర్తిగా బాధపడ్డారని " అని CNN పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్ మాజీ ప్రెస్ సెక్రటరీ స్టెఫానీ గ్రిషమ్కాగా ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇదిలా వుంటే డొనాల్డ్ ట్రంప్ తాను "జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని" చెప్పారు. అయితే తన జైలు శిక్ష మద్దతుదారులకు "కఠినమైనది" అని చెప్పుకొచ్చారు. శుక్రవారం (మే 31) న ఈ సంచలన తీర్పు వెలువడింది.