Page Loader
Donald Trump: అమెరికా ఉత్పత్తులపై భారత్‌ అత్యధిక పన్నులు.. . మరోసారి సుంకాల ప్రస్తావన తెచ్చిన ట్రంప్‌
అమెరికా ఉత్పత్తులపై భారత్‌ అత్యధిక పన్నులు

Donald Trump: అమెరికా ఉత్పత్తులపై భారత్‌ అత్యధిక పన్నులు.. . మరోసారి సుంకాల ప్రస్తావన తెచ్చిన ట్రంప్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 11, 2024
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా (USA) పాలన పగ్గాల కోసం పోటీపడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ (India) 'సుంకాల' అంశాన్ని తెరపైకి తెచ్చారు. భారత్ అత్యధికంగా పన్నులు విధిస్తోందని ఆయన తెలిపారు. తాను అధికారంలోకి వస్తే, భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై పన్నులు విధిస్తానని పేర్కొన్నారు. అమెరికా నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై చైనా 200 శాతం సుంకం విధిస్తోందని, బ్రెజిల్‌లో కూడా పరిస్థితి అలాంటి దేనని ట్రంప్ చెప్పారు.

వివరాలు 

చైనా 200 పర్సెంట్ టారిఫ్‌ను వసూలు

"రెసిప్రొసిటీ (పరస్పర ప్రయోజనం కోసం వస్తువులను మార్పిడి చేసుకోవడం) అమెరికాను మళ్లీ అసాధారణ స్థాయిలో సుసంపన్నంగా మార్చాలనే నా ప్రణాళికలో అత్యంత ముఖ్యమైన అంశం. మనం సాధారణంగా టారిఫ్‌లు వసూలు చేయం కాబట్టి, నా ప్లాన్‌లో ఇది చాలా ముఖ్యమైన భాగం. నేను ఆ ప్రక్రియను మొదలు పెట్టాను. చైనా 200 పర్సెంట్ టారిఫ్‌ను వసూలుచేస్తుంది. బ్రెజిల్ విషయంలో పరిస్థితి కూడా అలాగే ఉంది. అయితే, భారత్ అత్యధికంగా సుంకాలు వసూలుచేస్తోంది. కానీ మాకు భారత్‌తో మంచి సంబంధాలున్నాయి. మోదీ గొప్ప నాయకుడు, గొప్ప వ్యక్తి'' అని ఒకవైపు భారత్‌తో సంబంధాల గురించి ప్రస్తావిస్తూనే సుంకాల గురించి మాట్లాడారు.

వివరాలు 

భారత్‌ 'టారిఫ్ కింగ్' 

అదే విధంగా, ఇంధన ధరల గురించి కూడా ట్రంప్ స్పందించారు. "రానున్న 12 నెలల్లో ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ ధరలను సగానికి తగ్గిస్తాను. మన విద్యుత్ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాం. దీని ద్వారా ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ఈ చర్యల వల్ల అమెరికాలో, ముఖ్యంగా మిచిగాన్‌లో వ్యాపార అవకాశాలు పెరుగుతాయి'' అని ఆయన చెప్పారు. 2019లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత్‌ను 'టారిఫ్ కింగ్' అని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే, భారత్‌కు జీఎస్‌పీ (GSP)ని రద్దు చేశారు.ఈ హోదా వల్ల భారత మార్కెట్లలో సమాన, హేతుబద్ధ సందానత లభించలేదని ఆయన ఆరోపించారు. జీఎస్‌పీ(జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్)కింద అమెరికాకు అర్హత గల అభివృద్ధి చెందిన దేశాలు సుంకం రహిత ఎగుమతులు చేయడానికి వీలుగా ఉంటుంది.

వివరాలు 

మనం పన్నులు కడితే, వారి నుంచి కూడా వసూలుచేయాల్సిందే

"మన ఉత్పత్తులకు భారత్ 200 శాతం పన్నులు వసూలుచేస్తుంటే, మనం వారి ఉత్పత్తులకు ఎలాంటి సుంకాలు విధించకూడదా? అది సరికాదు. మనం పన్నులు కడితే, వారి నుంచి కూడా వసూలుచేయాల్సిందే. 2024 అధ్యక్ష ఎన్నికల్లో నన్ను గెలిపించి అధికారంలోకి తీసుకొస్తే, భారత్‌పై పరస్పర సమానమైన ప్రతీకార పన్నును విధిస్తాను'' అని ట్రంప్ గతంలో హెచ్చరించారు.