LOADING...
Trump: యూరప్ సరైన దిశలో పయనించడం లేదు: ట్రంప్
యూరప్ సరైన దిశలో పయనించడం లేదు: ట్రంప్

Trump: యూరప్ సరైన దిశలో పయనించడం లేదు: ట్రంప్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2026
07:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం - WEF)ను ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగ ఆరంభంలోనే అమెరికాలో ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతోందని ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

అమెరికా వాణిజ్య లోటు 77 శాతం తగ్గింది: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.అమెరికా వాణిజ్య లోటు భారీగా తగ్గిందని తెలిపారు. తన పాలనలో ఒకే ఏడాదిలోనే దేశ వాణిజ్య లోటును 77 శాతం వరకు తగ్గించగలిగామని ట్రంప్ వెల్లడించారు. జో బైడెన్ పాలనలో దేశంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరిగిందని ట్రంప్ విమర్శించారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఏడాది తర్వాతే ఆర్థిక వ్యవస్థలో స్పష్టమైన మార్పులు కనిపించాయని చెప్పారు. గత ఏడాది వరకు అమెరికా పరిస్థితి మృత దేశంలా ఉందని వ్యాఖ్యానించారు. వాణిజ్య లోటు తగ్గించడంలో తన ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని ట్రంప్ తెలిపారు. మొదట్లో కొందరే తాను బాగా పనిచేస్తున్నానని భావించారని, ఇప్పుడు అయితే ఎక్కువ మంది తన పనితీరును మెచ్చుకుంటున్నారని ఆయన అన్నారు.

వివరాలు 

అమెరికాపై కెనడా, ఫ్రాన్స్‌ విమర్శలు

ట్రంప్‌ ప్రసంగానికి ముందే పలు దేశాలు అమెరికాపై తీవ్ర విమర్శలు చేశాయి. అమెరికా అనుసరిస్తున్న విధానాలపై అంతర్జాతీయ వేదికలపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది. కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ మాట్లాడుతూ, అమెరికా నేతృత్వంలో నడిచిన గ్లోబల్‌ వ్యవస్థ యుగం ఇక ముగిసిందన్నారు. ఒకప్పుడు కలిసి అభివృద్ధి సాధిస్తామని చెప్పిన ఆర్థిక సమీకరణనే ఇప్పుడు మహాశక్తులు ఆయుధంలా ఉపయోగిస్తున్నాయని విమర్శించారు. ఇక ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయెల్‌ మాక్రాన్‌ మాట్లాడుతూ, అభివృద్ధి, స్థిరత్వం అవసరమేనని స్పష్టం చేశారు. అయితే దాదాగిరి చేసే వాళ్ల కంటే పరస్పర గౌరవాన్నే తాము ఎక్కువగా ఇష్టపడతామని చెప్పారు.

Advertisement

వివరాలు 

ట్రంప్ గ్రీన్‌లాండ్ ప్రణాళికపై వివాదం 

గ్రీన్‌లాండ్‌ను అమెరికా భాగంగా మార్చాలన్న ఆలోచనతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకు వస్తున్నారు. ఇది అమెరికా భద్రతకు ఎంతో కీలకమని,అలాగే అక్కడ ఉన్న విలువైన ఖనిజ వనరులు,రష్యా-చైనా ప్రభావాన్ని కట్టడి చేయాలన్న కోణంలో ఈ నిర్ణయం అవసరమని ట్రంప్ చెబుతున్నారు. అయితే ట్రంప్ ప్రతిపాదనకు యూరోపియన్ దేశాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ట్రంప్ విడుదల చేసిన ఒక మ్యాప్‌లో గ్రీన్‌లాండ్‌తో పాటు కెనడా, వెనిజువెలాలను కూడా అమెరికా భాగంగా చూపించడం మరింత దుమారం రేపింది. ఇక గ్రీన్‌లాండ్ ప్రణాళికకు వ్యతిరేకంగా నిలిచిన 8యూరోపియన్ దేశాలపై ట్రంప్ చర్యలకు దిగారు. ఆ దేశాలపై 10 శాతం టారిఫ్ విధిస్తూ ఆయన నిర్ణయం తీసుకోవడంతో అంతర్జాతీయంగా ఈ అంశం మరింత వేడెక్కింది.

Advertisement