
Donald Trump: లైంగిక వేధింపుల కేసులో డొనాల్డ్ ట్రంప్ రూ.688 కోట్ల జరిమానా
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ.. డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రచయిత ఇ.జీన్ కారోల్‌పై అత్యచారానికి సంబంధించిన పరువు నష్టం కేసులో ట్రంప్‌కు వ్యతిరేకంగా మాన్హాటన్ కోర్టు తీర్పు ఇచ్చింది.
పరువు నష్టం కేసులో రచయిత కారోల్‌కు 83 మిలియన్ డాలర్లు(రూ.688 కోట్లు) చెల్లించాలని జ్యూరీ ఆదేశించింది.
అయితే, జ్యూరీ నిర్ణయంపై ట్రంప్ నిరసన వ్యక్తం చేస్తూ.. దీనిపై తాను ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్ చేస్తానని చెప్పారు.
ట్రంప్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తనను అబద్దాలకోరు అని పిలిచి పరువు తీశారని కారోల్ఆరోపించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రత్యర్థులు కోర్టు తీర్పు ఆయుధంగా మారనుంది.
ట్రంప్
కేసు నేపథ్యం ఇదీ
1996లో మాన్‌హట్టన్‌లోని లగ్జరీ బెర్గ్‌డార్ఫ్ గుడ్‌మాన్ డిపార్ట్‌మెంట్ స్టోర్‌లోని దుస్తులు మార్చుకునే గదిలో ట్రంప్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని రచయిత్రి కరోల్ పేర్కొన్నారు.
కారోల్ 2019లో విడుదలైన తన పుస్తకంలో ఈ విషయాన్ని మొదటిసారిగా వెల్లడించాడు. ట్రంప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన 16వ మహిళ ఆమె.
కారోల్ తన రచనలను అమ్ముకునేందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తోందని ట్రంప్ ఆరోపించారు.
దీంతో 2022లో ట్రంప్‌పై ఆమె లైంగిక వేధింపులు, పరువునష్టం దావా వేశారు. ట్రంప్ తన ప్రతిష్టను నాశనం చేసుకున్నారని కారోల్ ఆరోపించారు.
మాన్‌హట్టన్ ఫెడరల్ కోర్ట్‌లోని తొమ్మిది మంది సభ్యుల జ్యూరీ పిటిషన్‌ను విచారించి తన తీర్పును వెలువరించింది.