Page Loader
Donald Trump: ట్రంప్‌ కుమారుడు బారన్‌కు సీటు నిరాకరించడం వల్లే హార్వర్డ్‌పై కక్ష సాధింపు.. సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం
సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం

Donald Trump: ట్రంప్‌ కుమారుడు బారన్‌కు సీటు నిరాకరించడం వల్లే హార్వర్డ్‌పై కక్ష సాధింపు.. సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2025
10:44 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం బడ్జెట్‌కు, పన్ను మినహాయింపులకు కోతలు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా, ట్రంప్‌ ప్రభుత్వం హార్వర్డ్‌ వంటి యూనివర్సిటీలకు విదేశీ విద్యార్థులను చేర్చుకునే అనుమతిని రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ చర్య వెనుక ఉన్న అసలైన కారణం ట్రంప్‌ చిన్న కుమారుడు బారన్ ట్రంప్‌కు హార్వర్డ్‌ యూనివర్సిటీలో అడ్మిషన్‌ నిరాకరించడం అని ఆన్‌లైన్‌లో ప్రచారం జోరుగా సాగుతోంది. నెటిజన్ల కథనాల ప్రకారం,హార్వర్డ్‌తో పాటు కొలంబియా,స్టాన్‌ఫోర్డ్‌ వంటి ప్రముఖ యూనివర్సిటీలు కూడా బారన్‌కు సీటు నిరాకరించాయి. దీంతో ఆయన న్యూయార్క్‌ యూనివర్సిటీ (NYU)కి చెందిన స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫైనాన్స్ కోర్సు కోసం అడ్మిషన్‌ తీసుకున్నట్లు చెబుతున్నారు.

వివరాలు 

బారన్ ట్రంప్‌ అసలు హార్వర్డ్‌కు దరఖాస్తే చేయలేదు: మెలానియా ట్రంప్‌ 

మరోవైపు, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తె మలియా ఒబామాకు హార్వర్డ్‌లో సీటు కల్పించగా, ట్రంప్‌ కుమారుడిని నిరాకరించడంపై ట్రంప్‌ కక్షపూరిత చర్యలు చేపట్టారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రచారాన్ని హార్వర్డ్‌ యూనివర్సిటీ తీవ్రంగా ఖండించింది. అలాగే, డొనాల్డ్ ట్రంప్‌ భార్య మెలానియా ట్రంప్‌ కార్యాలయం స్పందిస్తూ, బారన్ ట్రంప్‌ అసలు హార్వర్డ్‌కు దరఖాస్తే చేయలేదని స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో హార్వర్డ్‌కు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని తగ్గించిన ట్రంప్‌, ఇప్పుడు విదేశీ విద్యార్థులపై నిషేధం విధిస్తూ మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. దీనికి వ్యతిరేకంగా హార్వర్డ్‌ యూనివర్సిటీ న్యాయపోరాటం ప్రారంభించింది. ట్రంప్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

వివరాలు 

విదేశీ విద్యార్థుల వివరాలు తెలుసుకోవాలన్నదే మా ఉద్దేశం

ఈ కేసులో విచారణ జరిపిన ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి, ట్రంప్‌ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. "విదేశీ విద్యార్థుల వివరాలు తెలుసుకోవాలన్నదే మా ఉద్దేశం. వీరిని పంపుతున్న దేశాలు వారి విద్య కోసం డబ్బులు చెల్లించడం లేదు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.