Page Loader
కింగ్ చార్లెస్ III పట్టాభిషేకానికి ప్రిన్స్ హ్యారీ హాజరుపై అనుమానమే! 
కింగ్ చార్లెస్ III పట్టాభిషేకానికి ప్రిన్స్ హ్యారీ హాజరుపై అనుమానమే!

కింగ్ చార్లెస్ III పట్టాభిషేకానికి ప్రిన్స్ హ్యారీ హాజరుపై అనుమానమే! 

వ్రాసిన వారు Stalin
May 04, 2023
04:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

మే 6వ తేదీన లండన్‌లో కింగ్ చార్లెస్ III పట్టాభిషేక వేడుక‌ను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక ఉత్సవం కోసం బ్రిటన్ రాజవంశం అంతా సిద్ధమైంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి చార్లెస్ కొడుకు ప్రిన్స్ హ్యారీపైనే ఉంది. అతను కింగ్ చార్లెస్ III పట్టాభిషేకానికి హాజరవుతాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి రావాలని ప్రిన్స్ హ్యారీకు కూడా ఆహ్వానం అందింది. అయితే ఈ గ్రాండ్ ఈవెంట్‌కు ప్రిన్స్ హ్యారీ హాజరుకాకపోవచ్చని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఒక వేళ ప్రిన్స్ హ్యారీ ఈ వేడుకకు హాజరైతే వివాదాస్పద తన జీవిత కథ 'స్పేర్' పుస్తకం విడుదల తర్వాత రాయల్ ఫ్యామిలీతో తలపడటం ఇదే మొదటిసారి అవుతుంది.

బ్రిటన్

ప్రిన్స్ హ్యారీ హాజరుపై ఎలాంటి సమాచారం లేదు: ప్యాలెస్ ప్రతినిధి

ప్రిన్స్ హ్యారీ హాజరపై రాయల్ ప్యాలెస్ ప్రతినిధి చార్లీ రే స్పందించారు. పట్టాభిషేకానికి ప్రిన్స్ హ్యారీ హాజరవుతారని కానీ, అతని షెడ్యూల్ గురించి కానీ ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. అయితే రాయల్ ప్యాలెస్‌లో ఉన్నవారు హ్యారీ గురించి ఆందోళన చెందుతున్న చెందుతున్నట్లు చార్లీ రే తెలిపారు. హ్యారీ రాకపై సమాచారం లేనందున అతను ఎప్పుడు వస్తారు? అతని షెడ్యూల్ ఏంటి? అతను ఎక్కడ బస చేస్తారు? ఎప్పుడు వెళ్తారు? రాయల్ ప్యాలెస్‌కు తెలియదు. ప్రిన్స్ హ్యారీ తన తండ్రి పట్టాభిషేక కార్యక్రమానికి హాజరుకాకుండా ఉండటానికి ఒక సాకు కోసం వెతుకుతున్నట్లు మరో రాయల్ ప్యాలెస్ ప్రతినిధి టామ్ బోవర్ అన్నారు.