Page Loader
Elon Musk: డ్రోన్‌లదే భవిష్యత్తు.. ఫైటర్‌ జెట్‌లపై ఎలాన్ మస్క్‌ విమర్శలు
డ్రోన్‌లదే భవిష్యత్తు.. ఫైటర్‌ జెట్‌లపై ఎలాన్ మస్క్‌ విమర్శలు

Elon Musk: డ్రోన్‌లదే భవిష్యత్తు.. ఫైటర్‌ జెట్‌లపై ఎలాన్ మస్క్‌ విమర్శలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 26, 2024
11:01 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల విజయంతో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌, వివేక్‌ రామస్వామి సంయుక్త సారథులుగా నియమితులయ్యారు. ఈ పద్ధతిలో అమెరికా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు మస్క్‌ పలు ప్రగతిశీల ఆలోచనలను ముందుకు తెచ్చారు. ఆధునిక యుద్ధ విమానాల కంటే డ్రోన్‌లు అధిక ప్రయోజనాన్ని అందిస్తామని మాస్క్ అభిప్రాయపడ్డారు. డ్రోన్‌ల వినియోగ కాలంలో మానవ సహిత ఫైటర్‌ జెట్‌లను ఉపయోగించడం అనవసరంగా మారిందని, ఇవి పైలట్‌ల ప్రాణాలను తీస్తున్నాయని చెప్పారు. అయినా ఎఫ్‌-35 వంటి యుద్ధవిమానాలను ఇంకా తయారు చేస్తున్నారని, అయితే అవి నేటి యుద్ధ అవసరాలకు సరిపడవని మాస్క్ వెల్లడించారు.

Details

భవిష్యత్తులో యుద్దాలన్నీ డ్రోన్ లతోనే!

ప్రపంచంలోని అత్యాధునిక యుద్ధ విమానాలుగా ఎఫ్‌-35లు పేరొందాయి. వీటిని ఆధునాతన ఫీచర్లతో రూపొందించారు. అయితే వాటికి సాంకేతిక లోపాలు, నిర్వహణకు అధిక వ్యయం వంటి సమస్యలు ఉన్నాయి. ప్రత్యేకంగా కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లు, నిర్వహణకు సంబంధించిన విమర్శలు వాటిపైన వస్తున్నాయి. ఫైటర్‌ జెట్‌లపై సాంకేతిక ఆధారిత విమర్శలను మస్క్‌ తన పోస్టు ద్వారా వ్యక్తం చేశారు. భవిష్యత్‌ యుద్ధాలు డ్రోన్‌ల ఆధారంగా సాగుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఫైటర్‌ జెట్‌లతో పోలిస్తే డ్రోన్‌లకు మస్క్ మద్దతు తెలపడం విశేషం.