Page Loader
'Divorce': దుబాయ్ ప్రిన్సెస్ షేఖా మహరా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ వైరల్.. ఈ 'డివోర్స్‌' చాలా స్పెషల్‌
దుబాయ్ ప్రిన్సెస్ షేఖా మహరా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ వైరల్

'Divorce': దుబాయ్ ప్రిన్సెస్ షేఖా మహరా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ వైరల్.. ఈ 'డివోర్స్‌' చాలా స్పెషల్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 10, 2024
03:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

దుబాయ్ యువరాణి షేక్ మహ్రా (Dubai Princess Sheikha Mahra) ఇటీవల విడాకుల ప్రకటనతో అందరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా, ఆమె మరో ఆసక్తికరమైన ప్రకటన చేశారు, తన సొంత బ్రాండ్‌ కింద ఒక కొత్త పెర్ఫ్యూమ్‌ను ఆవిష్కరించారన్నారు. ఈ కొత్త పరిమళ ద్రవ్యానికి ఆమె పెట్టిన పేరు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. మరి అసలు విషయం ఏమిటంటే? షేక్ మహ్రా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా "Divorce" పేరిట కొత్త పెర్ఫ్యూమ్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త ఉత్పత్తిని తన సొంత బ్రాండ్‌ "మహ్రా ఎమ్‌1" కింద త్వరలో మార్కెట్‌లోకి తీసుకురానున్నారు.

వివరాలు 

భర్తతో విడాకులు

ఆ పర్‌ఫ్యూమ్ విలువ ఇంకా తెలియాల్సి ఉంది, కానీ ఇది విపణిలో చాలా చర్చనీయాంశం అవుతోంది. గతంలో, ఆమె భర్తతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. దుబాయ్ పాలకుడు, యూఏఈ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తెగా జన్మించిన మహ్రా బ్రిటన్‌లో ఉన్నతవిద్యను అభ్యసించి, అంతర్జాతీయ వ్యవహారాల్లో పట్టు సాధించారు. మహిళా సాధికారతకు కృషి చేస్తూ, ఆమె తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. 2023 మే 27న ఆమె ప్రముఖ వ్యాపారవేత్త షేక్ మనా బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్‌తో వివాహం చేసుకున్నారు.

వివరాలు 

చర్చనీయాంశమైన "మనమిద్దరం మాత్రమే" వ్యాఖ్య 

వివాహం తర్వాత, భర్త, చిన్నారితో కలసి తన జీవితంలో అత్యంత విలువైన జ్ఞాపకాలుగా పేర్కొంటూ మహ్రా కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొన్ని రోజులు తరువాత, ఆమె చిన్నారితో ఉన్న మరో ఫొటోను "మనమిద్దరం మాత్రమే" అనే వ్యాఖ్యతో షేర్ చేయడం చర్చనీయాంశమైంది. కానీ, జులై నెలలో విడాకులు ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె భర్తకు రాసిన సందేశంలో, "మీరు ఇతరుల సహవాసం కోరుకోవడం వల్ల, నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. 'ఐ డివోర్స్‌ యూ'. టేక్‌ కేర్‌.. మీ మాజీ భార్య" అంటూ ఆమె తన నిర్ణయాన్ని వెల్లడించారు.