Earthquake: సెంట్రల్ మెక్సికోలో 5.8 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ మెక్సికో(Central mexico)లో గురువారం మధ్యాహ్నం (స్థానిక కాలమానం ప్రకారం)రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఆ దేశ జాతీయ భూకంప శాస్త్ర సంస్థ తెలిపింది. భూకంపం ధాటికి మెక్సికో సిటీలోని భవనాలు కంపించాయి. ప్రకంపనల కారణంగా,ప్రజలు భవనాల నుండి బయటకు వచ్చి వీధుల్లో గుమిగూడారని వార్తా సంస్థ AFP నివేదించింది. వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం,రాజధాని అంతటా భూకంప హెచ్చరికలు వినిపించాయి. అయితే, ఎటువంటి నష్టం జరిగినట్లు సమాచారం లేదని,ఫెడరల్ సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ చీఫ్ చెప్పారు. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం,ప్యూబ్లా రాష్ట్రంలోని మెక్సికో నగరానికి దక్షిణంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నచియాట్లా డి టాపియా సమీపంలో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:03 గంటలకు భూకంపం సంభవించింది.