Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో 5.2 తీవ్రతతో భూకంపం
ఆఫ్ఘనిస్తాన్‌లో 5.2 తీవ్రతతో మంగళవారం ఉదయం భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నివేదించింది. NCS ప్రకారం, మంగళవారం ఉదయం సంభవించిన 5.2 తీవ్రతతో భూకంపం ఉపరితలం నుండి 120 కిలోమీటర్ల దిగువన,అక్షాంశం 36.33, రేఖాంశం 70.70 వద్ద ఉద్భవించింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అక్టోబర్‌లో, పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం, బలమైన అనంతర ప్రకంపనల కారణంగా డజన్ల కొద్దీ ప్రజలు మరణించారని ఆ దేశ జాతీయ విపత్తు అథారిటీ తెలిపింది. రెండు దశాబ్దాలలో దేశంలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపాలలో సుమారు 2,000 మంది మరణించారు.