
Earthquake: థాయిలాండ్, మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రత
ఈ వార్తాకథనం ఏంటి
మయన్మార్, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.7గా నమోదైంది.
భీకర ప్రకంపనలతో ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. పలు కార్యాలయాల అద్దాలు ధ్వంసం కాగా, భూప్రకంపనలకు పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కూడా ఊగిపోయాయి.
ఈ భారీ భూకంపం మయన్మార్ మధ్య ప్రాంతాన్ని కుదిపేసింది. బ్యాంకాక్ సహా థాయిలాండ్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు తీవ్రంగా నమోదు అయ్యాయి.
చియాంగ్ మాయి వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో టూరిస్టులు భయంతో పరుగులు పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Details
భయంతో రోడ్లపైకి వచ్చిన ప్రజలు
భూకంప ప్రభావంతో స్విమ్మింగ్ పూల్ నీళ్లు కదిలిపోవడం, పలు భవనాల అద్దాలు పగిలిపోవడం, ప్రజలు గజగజ వణికిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
భయంతో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. అధికారులు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఈ భూకంపం కారణంగా జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం గురించి పూర్తిస్థాయిలో వివరాలు తెలియరాలేదు.
కానీ ప్రకంపనల తీవ్రత దృష్ట్యా భారీ నష్టం సంభవించే అవకాశముందని అనుమానిస్తున్నారు. అధికారుల ప్రకారం, భూకంప ప్రభావంపై మరింత సమాచారం త్వరలో వెల్లడికానుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భూకంపం దృశ్యాలు
Breaking: Video shows water falling from a rooftop pool after earthquake tremors hit Bangkok. pic.twitter.com/nzoKKo42fg
— PM Breaking News (@PMBreakingNews) March 28, 2025