తదుపరి వార్తా కథనం
    
    
                                                                                Earthquake: జపాన్‌లో భూకంపం కలకలం.. 6.9 తీవ్రతతో ప్రకంపనలు
                వ్రాసిన వారు
                Jayachandra Akuri
            
            
                            
                                    Jan 13, 2025 
                    
                     06:57 pm
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
జపాన్ నైరుతి ప్రాంతంలో భారీ భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.9గా నమోదైన ఈ భూకంపం గురించి జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. సోమవారం రాత్రి 9.19 గంటలకు భూకంపం సంభవించినట్లు ప్రకటించారు. మియాజాకి ప్రిఫెక్చర్, క్యూషు నైరుతి ద్వీపంతో పాటు కోచి ప్రిఫెక్చర్ ప్రాంతాల్లో భూకంప ప్రభావం తీవ్రంగా ఉంటుందని జపాన్ ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రకృతి విపత్తుతో ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టంపై ఇంకా పూర్తి సమాచారం అందుబాటులో లేదు.