
Japan Earthquake: 62కి చేరిన జపాన్‌లో భూకంప మృతుల సంఖ్య.. వాతావరణశాఖ హెచ్చరికలు జారీ
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్‌లోని ఇషికావా ప్రిఫెక్చర్‌లో సోమవారం 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 62కి పెరిగిందని వార్తా సంస్థ AFP బుధవారం నివేదించింది.
ది జపాన్ న్యూస్ ప్రకారం,వాజిమాలో 29 మంది,సుజులో 22 మంది,నానోలో ఐదుగురు,అనామిజు, హకుయ్,షికాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
సహాయక చర్యలు ఇంకా కొనసాగుతుండగా,జపాన్ వాతావరణ సంస్థ (JMA) ఆ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుందని హెచ్చరించింది.
హోన్షు ప్రధాన ద్వీపంలోని ఇషికావా ప్రిఫెక్చర్‌ను కదిలించిన శక్తివంతమైన భూకంపం ఫలితంగా ఒక మీటర్‌కు మించి సునామీ అలలు ఏర్పడ్డాయి. మంటలు చెలరేగడంతోపాటు పలు రోడ్లు ఛిద్రమయ్యాయి.
Details
అగ్నిప్రమాదంతో ధ్వంసం అయ్యిన భవనాలు
సోమవారం నుండి, ద్వీప దేశం 155 భూకంపాలతో దెబ్బతింది, వీటిలో ప్రారంభ 7.6 తీవ్రత,మరో 6 కంటే ఎక్కువ భూకంపాలు సంభవించాయని జపాన్ వాతావరణ కార్యాలయం తెలిపింది.
నోటో ద్వీపకల్పం చాలా తీవ్రంగా దెబ్బతింది, అనేక వందల భవనాలు అగ్నిప్రమాదంతో ధ్వంసమయ్యాయి.
వాజిమా, సుజు వంటి పట్టణాలలో పట్టణాలలో ఇళ్లు కూలిపోయాయి. మొదటిసారి భూకంపం సంభవించిన వెంటనే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.5 అడుగుల ఎత్తులో అలలు దేశాన్ని తాకాయి.
సుజులోని దాదాపు 33,000 గృహాలకు విద్యుత్తు సరఫరా లేదు. ప్రధాన రహదారులతో సహా దేశవ్యాప్తంగా అనేక ముఖ్యమైన మార్గాలలో ఆటంకం ఏర్పడింది.
దీనివల్ల వైద్యులు, సైనిక సిబ్బంది రెస్క్యూ సేవలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది.