Loading...
Egypt: 'మక్కా ఒప్పందం'లోకి ఈజిప్ట్‌.. కీలక ప్రకటన చేసిన తుర్కియే
'మక్కా ఒప్పందం'లోకి ఈజిప్ట్‌.. కీలక ప్రకటన చేసిన తుర్కియే

Egypt: 'మక్కా ఒప్పందం'లోకి ఈజిప్ట్‌.. కీలక ప్రకటన చేసిన తుర్కియే

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 09, 2026
10:37 am

ఈ వార్తాకథనం ఏంటి

నాటో తరహా భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో పాకిస్థాన్‌, సౌదీ అరేబియా, తుర్కియే దేశాలు 'మక్కా సమష్టి రక్షణ ఒప్పందం' (Defense Agreement)పై సంతకం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కూటమిలో ఈజిప్ట్‌ కూడా చేరనున్నట్లు తుర్కియే విదేశాంగ మంత్రి వెల్లడించారు. అన్ని అంశాల్లో తమకు భాగస్వామిగా ఉండే ఈజిప్ట్‌.. మక్కా ఒప్పందంలోనూ భాగస్వామి కానుందని తెలిపారు. అయితే ఈ ఒప్పందం ద్వారా ఏ ఒక్క దేశాన్నీ లక్ష్యంగా చేసుకోవడం లేదని తుర్కియే స్పష్టం చేసింది. తమ భద్రతను, రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఒప్పందంపై సంతకాలు చేసినట్లు పేర్కొంది. ఈ కూటమి భవిష్యత్తులో మరింత విస్తరించే అవకాశం ఉందని తుర్కియే విదేశాంగ మంత్రి తెలిపారు.

వివరాలు

ఈ ఆలోచన ఇప్పటిది కాదు..

రానున్న రోజుల్లో మరిన్ని దేశాలు తమతో చేతులు కలుపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో శాశ్వత శాంతి, స్థిరత్వాన్ని తీసుకురావడంలో మక్కా రక్షణ ఒప్పందం కీలక ముందడుగు అవుతుందని పేర్కొన్నారు.

నాటో తరహా రక్షణ కూటమిని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఇప్పటిది కాదు. 'అరబ్‌ వసంతం' అనంతరం ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు 34 ముస్లిం దేశాలు ఏకతాటిపైకి రావాలని సౌదీ అరేబియా పిలుపునిచ్చింది.

2015లో ఈజిప్ట్‌ కూడా ఇదే తరహాలో మరో ప్రతిపాదన చేసింది. అయితే సార్వభౌమాధికారం సహా పలు కారణాలతో ఆ ప్రయత్నం ముందుకు సాగలేదు.

ప్రస్తుతం గల్ఫ్‌ దేశాలపై దాడులు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో మక్కా రక్షణ ఒప్పందం తెరపైకి వచ్చింది.

వివరాలు

ఉమ్మడిగా సైనిక విన్యాసాలు

ఈ ఒప్పందంలో భాగంగా కూటమిలోని ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా.. మిగిలిన మూడు దేశాలపై దాడి జరిగినట్లుగానే పరిగణించనున్నారు.

అంతేకాకుండా ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించడం, రక్షణ దళాలకు ప్రత్యేక శిక్షణ అందించడం, రక్షణ రంగంలో సాంకేతికతను పరస్పరం బదిలీ చేసుకోవడం, నిఘా సమాచారాన్ని పంచుకోవడం వంటి అంశాలకు ఈ ఒప్పందం మార్గం సుగమం చేయనుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ADVERTISEMENT