LOADING...
అమెరికాలో అరాచకం..యువకుడు కొట్టడంతో వృద్ధ సిక్కు మృతి, ఖండించిన మేయర్
అమెరికాలో అరాచకం..వృద్ధ సిక్కుపై యువకుడి తీవ్ర దాడి, ఖండించిన మేయర్

అమెరికాలో అరాచకం..యువకుడు కొట్టడంతో వృద్ధ సిక్కు మృతి, ఖండించిన మేయర్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 23, 2023
12:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

వృద్ధ సిక్కు జస్మర్ సింగ్ (66) అమెరికాలోని న్యూయార్క్ లో మరణించాడు. 30 ఏళ్ల గిల్బర్ట్ అగస్టిన్‌ కారు, సింగ్ కారు పరస్పరం ఢీకొన్నాయి. దీంతో నిందితుడు, సింగ్ తలపై, ముఖంపై తీవ్రంగా దాడి చేశాడు.తీవ్రగాయాలతో సింగ్ కిందపడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై స్పందించిన మేయర్ ఆడమ్స్,దాడిని తీవ్రంగా ఖండించారు. ద్వేషాన్ని తిరస్కరించండి అంటూ పిలుపునిచ్చారు. సిక్కు సమాజం తరఫున కంటే న్యూయార్క్ వాసులందరి తరపున, మీకు మా సంతాపం ఎక్కువ ఉంటుందన్నారు.ఈ మేరకు తన బృందం ఈ వారం నగరంలోని సిక్కు నాయకులను కలుస్తుందని పేర్కొన్నారు. అక్టోబరు 19న తలకు తీవ్ర గాయంతో క్వీన్స్‌లోని జమైకా హాస్పిటల్ కు తరలించారు. అక్టోబర్ 20న నిందితుడు గిల్బర్ట్ అగస్టిన్‌ను అరెస్ట్ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జస్మీర్ సింగ్, న్యూయార్క్ నగరాన్ని అమితంగా ప్రేమించేవారన్న మేయర్