LOADING...
Elephant Mosquitoes: వైరస్‌పై యుద్ధానికి ఏనుగు దోమలు.. కొవిడ్‌ తరహాలో ఆంక్షలను అమల్లోకి..
వైరస్‌పై యుద్ధానికి ఏనుగు దోమలు.. కొవిడ్‌ తరహాలో ఆంక్షలను అమల్లోకి..

Elephant Mosquitoes: వైరస్‌పై యుద్ధానికి ఏనుగు దోమలు.. కొవిడ్‌ తరహాలో ఆంక్షలను అమల్లోకి..

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 06, 2025
02:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనాలోని దక్షిణ ప్రాంతంలోని గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లోని ఫోషన్‌ నగరంలో గన్యా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. దీనిని అరికట్టేందుకు స్థానిక ప్రభుత్వం వైరస్‌పై యుద్ధం ప్రకటించింది. ఇందుకోసం కొవిడ్‌ కాలంలో అమలు చేసినవిధంగా పలు ఆంక్షలు, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. కేవలం ఒక నెలలోనే ఈ నగరంలో 7,000 పైగా గన్యా కేసులు నమోదవ్వడం అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. గత రెండు దశాబ్దాల్లో, అంటే 2008 తర్వాత చైనాలో గన్యా వైరస్‌ ఈ స్థాయిలో వ్యాపించడం ఇదే తొలిసారి.

వివరాలు 

సైన్యం రంగంలోకి - డ్రోన్లు, ఫాగింగ్, చేపలతో రక్షణ చర్యలు 

వైరస్‌ కట్టడి కోసం చైనా సైన్యాన్ని రంగంలోకి దించారు. వీధులన్నీ ఫాగింగ్‌ ద్వారా పూర్తిగా శానిటైజ్‌ చేస్తున్నారు. దోమలు ఎక్కువగా కనిపించే ప్రదేశాలను గుర్తించేందుకు ప్రత్యేక డ్రోన్లను వాడుతున్నారు. అంతేకాకుండా, దోమల్ని నాశనం చేసే ప్రత్యేక రకమైన 'ఎలిఫెంట్‌ మస్కిటో'లను పరిచయం చేశారు. అదనంగా, దోమల లార్వాలను తినే లక్షలాది చేపలను కాల్వల్లోకి వదిలారు, వాటి సంఖ్య 5,000కి పైగా ఉండొచ్చు.

వివరాలు 

ఏమిటీ ఎలిఫెంట్‌ మస్కిటో.. 

ఈ దోమలను శాస్త్రీయంగా 'టెక్సోరెంకైటిస్‌' (Toxorhynchites) అని పిలుస్తారు.వీటిని సాధారణంగా ఎలిఫెంట్‌ మస్కిటోలు అని కూడా అంటారు. ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద దోమల జాతిగా పరిగణించబడతాయి.ముఖ్యంగా అమెరికా,ఆస్ట్రేలియా, ఆసియా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ జాతిలో సుమారు 90 రకాలు ఉన్నాయి. వీటి సహజ నివాసం అడవులు. వీటి పరిమాణం 18 మిల్లీమీటర్ల నుంచి 24 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. మిగతా దోమల మాదిరిగా ఇవి మనుషుల రక్తాన్ని తాగవు. ఆడ ఎలిఫెంట్‌ మస్కిటోలు కూడా చెట్లు, మొక్కల రసాలను మాత్రమే పీలుస్తాయి,ఇవి కార్బోహైడ్రేట్లతో నిండిన ఆహారాన్ని కోరుకుంటాయి. ఇవి రాత్రివేళల్లో విశ్రాంతి తీసుకుంటాయి. వాటి ఆడదోమలు నీటి ఉపరితలంపై గుడ్లు వేస్తాయి - ఇది సాధారణ దోమలకూ సామాన్యంగా కనిపించే లక్షణమే.

వివరాలు 

ఎలిఫెంట్‌ మస్కిటోల లార్వాల ప్రత్యేకత 

ఈ దోమల గుడ్ల నుండి 40 నుంచి 60 గంటల్లోనే లార్వాలు బయటకు వస్తాయి. ఈ లార్వాలు సమీపంలోని ఇతర సాధారణ దోమల గుడ్లను తిని పెరుగుతాయి. ఒక్క ఎలిఫెంట్‌ మస్కిటో లార్వా కనీసం 100 దోమల గుడ్లను నాశనం చేయగలదు. ఇది ఇతర దోమల జననాన్ని అడ్డుకుంటుంది. అందుకే ఇవి సహజ శత్రువులుగా ఉపయోగపడుతున్నాయి.

వివరాలు 

ప్రపంచవ్యాప్తంగా 2,40,000 గన్యా కేసులు

ఇప్పటివరకు ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 2,40,000 గన్యా కేసులు నమోదయ్యాయి. వీటిలో 90 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ గణాంకాలను యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ (ECDC) విడుదల చేసింది. ఈ వ్యాధి ముఖ్యంగా దక్షిణ అమెరికా దేశాల్లో అత్యధికంగా వ్యాపించింది.