Elon Musk: ఇటలీ ప్రధానితో ఎలాన్ మస్క్ డేటింగ్..? స్పందించిన టెస్లా సీఈఓ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, టెస్లా CEO ఎలాన్ మస్క్ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని 'డేటింగ్' లో ఉన్నారంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
తాజాగా న్యూయార్క్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో వీరిద్దరి మధ్య సంభాషణ జరిగిన ఫోటో వైరల్ అయ్యాయి. దీంతో ఈ వార్తకు బలం చేకూరింది.
మంగళవారం న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో మస్క్, జార్జియా మెలోని గురించి మాట్లాడారు. ఆమె నిజాయతీపరురాలని ప్రశంసించారు.
అంతేకాక అట్లాంటిక్ కౌన్సిల్ గ్లోబల్ సిటిజన్ అవార్డును అందజేస్తూ ఆమె బయట కన్నా ఆమె మనసు మరింత అందమైందని మాస్క్ కొనియాడారు.
Details
డేటింగ్ చేయడం లేదు
అట్లాంటిక్ కౌన్సిల్ పంపిణీ చేసిన మీడియా ప్యాకేజీ ప్రకారం, మెలోని "EUకి బలమైన మద్దతు ఇవ్వడంతో పాటు ఇటలీకి మొదటి మహిళా ప్రధాని అయినందుకు ఈ అవార్డు లభించింది.
అయితే టెస్లా ఫ్యాన్ క్లబ్ మస్క్, మెలోని ఫోటోని పోస్ట్ చేసి 'మీరు డేటింగ్ చేస్తున్నారా'..? అని ప్రశ్నించింది.
దీనికి ఎలాన్ మస్క్ బదులిస్తూ డేటింగ్ చేయడం లేదని సమాధానం ఇచ్చాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
స్పందించిన మస్క్
Grazie Elon pic.twitter.com/NgHchWLUtB
— Giorgia Meloni (@GiorgiaMeloni) September 24, 2024