LOADING...
Elon Musk: కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. మస్క్ పెట్టిన పోల్‌కు భారీ రెస్పాన్స్.. 
కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. మస్క్ పెట్టిన పోల్‌కు భారీ రెస్పాన్స్..

Elon Musk: కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. మస్క్ పెట్టిన పోల్‌కు భారీ రెస్పాన్స్.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 06, 2025
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నారా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ప్రతిస్పందన ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారా? అనే ప్రశ్నలకు ప్రస్తుతం 'అవును' అనే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటికే మస్క్ కొత్త పార్టీ ఏర్పాటుకు కావలసిన ప్రాథమిక చర్యలు చేపడుతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో, మస్క్ తన అధికారిక 'ఎక్స్' (మాజీ ట్విట్టర్) ఖాతాలో "కొత్త పార్టీ పెట్టాలా?" అనే ఓ ప్రశ్నతో పోల్ నిర్వహించారు. ఈ పోల్‌కు నెటిజన్ల నుంచి విస్తృత స్థాయిలో స్పందన లభించింది. అందులో పాల్గొన్న వారిలో 81 శాతం మంది ఆయన కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించాలంటూ మద్దతు ప్రకటించారు.

వివరాలు 

మస్క్ ట్రంప్‌పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం

ఇదిలా ఉండగా, ట్రంప్, మస్క్ మధ్య భేదాభిప్రాయాలు రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయి. ఇద్దరూ ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. ఇటీవల మస్క్ ట్రంప్‌పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. "ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో ట్రంప్ పేరు ఉన్నందువల్లే ఆ ఫైళ్లు బయటకు రాలేవు" అని మస్క్ పేర్కొంటూ ఓ షాకింగ్ పోస్టు చేశారు. బిగ్‌ బ్యూటీఫుల్‌ బిల్‌ వ్యవహారంలో మస్క్‌ తీరుతో తాను‌ విసిగిపోయానంటూ ట్రంప్‌ మీడియా ముఖంగా పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే మస్క్ ఆ వ్యాఖ్యలకు ట్విట్టర్‌ ద్వారా ప్రత్యుత్తరం ఇచ్చారు.

వివరాలు 

ఆయన లేకున్నా నేనే గెలిచేవాడిని: ట్రంప్ 

ఇటీవల మస్క్ డోజ్ (Doge) శాఖ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మస్క్ చేసిన ఒక ట్వీట్‌లో, "నా వల్లే ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధించగలిగారు" అని వ్యాఖ్యానించారు. దానికి స్పందనగా ట్రంప్, "ఆయన లేకున్నా నేనే గెలిచేవాడిని" అని కౌంటర్ ఇచ్చారు. ఈ ప్రకటనల నేపథ్యంలో, మస్క్ తన స్వంత రాజకీయ పార్టీతో ట్రంప్‌కు ప్రత్యర్థిగా ఎదగాలని భావిస్తున్నట్లు సమాచారం. మస్క్ నిర్వహించిన ఈ పోల్‌కు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన లభించింది. సుమారు 41 లక్షల మంది ఓటు వేసారు. మొత్తం పోల్‌కు 5 కోట్లకుపైగా వ్యూస్ వచ్చాయి. పాల్గొన్నవారిలో 81 శాతం మంది కొత్త పార్టీ అవసరమేనని అభిప్రాయపడగా, 19 శాతం మంది మాత్రమే నిరాకరించారు.

వివరాలు 

అలా చేస్తే ఓట్లు చీలిపోతాయి..

కేవలం ఓటింగ్‌నే కాదు, నెటిజన్లు కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలను కూడా పంచుకుంటున్నారు. కొందరు మస్క్‌ను "లిబరేషన్ పార్టీ"కి మద్దతు ఇవ్వాలని సూచించగా, మరికొందరు "అలా చేస్తే ఓట్లు చీలిపోతాయి, ఫలితంగా డెమోక్రాట్లే మళ్లీ గెలుస్తారు" అంటూ వాదిస్తున్నారు. మొత్తంగా ఎలాన్ మస్క్ పెట్టిన ఈ పోల్ అమెరికాలోనే కాక, అంతర్జాతీయంగా కూడా హాట్ టాపిక్ అయింది. ఇక ఇప్పుడు ప్రధాన ప్రశ్న - ఈ ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని మస్క్ స్వతంత్ర రాజకీయ పార్టీని ప్రారంభిస్తారా? లేక ఇప్పటికే ఉన్న లిబరేషన్ పార్టీకి మద్దతు ఇవ్వడానికే పరిమితమవుతారా? లేదా తిరిగి ట్రంప్‌తో సఖ్యతగా ముందుకు వెళ్లే అవకాశం ఉందా? అన్నదాన్ని కాలమే సమాధానమిచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎక్స్ లో  మస్క్ పెట్టిన పోల్‌