Page Loader
Elon Musk: 'నన్ను క్షమించండి. నేను ఇంతకంటే భరించలేను'..ట్యాక్స్‌ బిల్లుకు వ్యతిరేకంగా మస్క్ గళం
ట్యాక్స్‌ బిల్లుకు వ్యతిరేకంగా మస్క్ గళం

Elon Musk: 'నన్ను క్షమించండి. నేను ఇంతకంటే భరించలేను'..ట్యాక్స్‌ బిల్లుకు వ్యతిరేకంగా మస్క్ గళం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2025
08:37 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఏర్పాటు చేసిన 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ' (DOGE) శాఖ నుంచి ఇటీవల ప్రపంచ ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌ తప్పుకున్న విషయం తెలిసిందే. ట్రంప్‌ ప్రభుత్వ కాలంలో తీసుకువచ్చిన పన్ను బిల్లుపై మస్క్‌ ఇప్పటికే అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బిల్లుపై ఆయన మరొకసారి తీవ్రంగా స్పందించారు. ఈ బిల్లు అమెరికన్ ప్రజలపై అధిక భారం పడుతోందని వ్యాఖ్యానించారు.

వివరాలు 

 అమెరికన్లపై భరించలేని ఆర్థిక భారం 

ఈ పన్ను బిల్లును ఉద్దేశించి మస్క్‌ తన ఎక్స్‌ (గతంలో ట్విట్టర్) అకౌంట్‌లో ఓ పోస్టు చేశారు. "నన్ను క్షమించండి. నేను ఇంతకంటే భరించలేను. ఇది అత్యంత దారుణమైన బిల్లు. ఇది కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన అత్యంత చెడ్డ బిల్లు. ఇది తప్పు అన్న విషయం మీకు తెలుసు. అయినా దానికి అనుకూలంగా ఓటు వేయడం మీకే అవమానంగా ఉంటుంది" అని వ్యాఖ్యానించారు. అంతేకాక, ఈ బిల్లుతో అమెరికా ద్రవ్య లోటు సుమారు 2.5 ట్రిలియన్ డాలర్లకు చేరనుందని హెచ్చరించారు. దీని ప్రభావంగా అమెరికన్లపై భరించలేని ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ 

వివరాలు 

స్పందించిన వైట్‌హౌస్.. 

మస్క్‌ చేసిన వ్యాఖ్యలపై వైట్‌హౌస్‌ తీవ్రంగా స్పందించింది. మస్క్‌ అభిప్రాయం అధ్యక్షుడు ట్రంప్‌కు తెలుసని ప్రెస్‌ సెక్రటరీ కరోలినా లివిట్‌ స్పష్టంగా చెప్పారు. అయితే, ఇది ట్రంప్‌ అభిప్రాయాన్ని మార్చదన్నారు. రాబోయే బిల్లు గొప్పదిగా ట్రంప్‌ భావిస్తున్నారని, దానికి ఆయన కట్టుబడి ఉన్నారని వివరించారు. మస్క్‌ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా నిరాశపరిచాయని హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్‌ అన్నారు. కానీ ట్రంప్‌కు వ్యతిరేకంగా గళమెత్తిన మస్క్‌కు రిపబ్లికన్ పార్టీలోని కొంతమంది నేతల నుంచి మద్దతు లభిస్తోంది. మస్క్‌ చెప్పినది నిజమేనని రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రతినిధి థామస్‌ పేర్కొన్నారు.

వివరాలు 

ఇంతకుముందూ ఇదే బిల్లుపై మస్క్‌ విమర్శలు

ఇంతకుముందూ ఇదే బిల్లుపై మస్క్‌ విమర్శలు చేశారు. ఈ బిల్లుతో ప్రభుత్వం ఎక్కువ బడ్జెట్‌ను ఖర్చు చేయాల్సి రావడం వల్ల DOGE శాఖకు ఉన్న వ్యయ నియంత్రణ లక్ష్యాలకు విఘాతం కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యయాల్ని తగ్గించాలనే ఉద్దేశంతో DOGE తీసుకున్న చర్యలు ఈ బిల్లుతో వృథా అవుతాయని మస్క్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కారణంగానే DOGE శాఖ చీఫ్‌ బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది.