
Elon Musk: ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడటం గొప్ప గౌరవం.. ఈ ఏడాది భారత పర్యటనకు వస్తా..
ఈ వార్తాకథనం ఏంటి
బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సంభాషించారు.
ఈ ఏడాది టెస్లా భారత్‌లోకి ప్రవేశించనున్న నేపథ్యంలో వీరి మధ్య జరిగిన చర్చకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.
ప్రధాని మోడీతో చర్చించిన మరుసటి రోజు ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సంవత్సరం చివరలో భారత్‌కు రావాలని తనకు ఉన్న ఉత్సుకతను ఆయన వ్యక్తపరిచారు. ప్రధాని మోడీతో సంభాషించడం తనకు గర్వకారణమని మస్క్ తెలిపారు.
ఇటీవల భారత్, అమెరికాల మధ్య సుంకాలపై చర్చలు సాగుతున్న సమయంలోనే మస్క్‌తో ప్రధాని మోడీ మాట్లాడటం గమనార్హం.
వివరాలు
టెక్నాలజీ,ఆవిష్కరణల రంగాల్లో సహకార అవకాశాలపై చర్చ
ప్రస్తుతం ఈ రెండు దేశాలు వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
మోడీ, ఎలాన్ మస్క్‌ల మధ్య జరిగిన సంభాషణను ప్రధాని మోడీ స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు.
టెక్నాలజీ,ఆవిష్కరణల రంగాల్లో సహకార అవకాశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.
అదేవిధంగా,ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వన్స్ భారత్ పర్యటన చేపట్టనున్నారు.
వివరాలు
ముంబై నగరానికి భారీగా టెస్లా కార్ల దిగుమతి
ఇదిలా ఉండగా,ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో భాగంగా ఎలాన్ మస్క్‌ను కలిసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా,కొన్ని నెలల్లో టెస్లా కంపెనీ భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. ముంబై నగరానికి భారీగా కార్లను దిగుమతి చేయనున్నట్లు సమాచారం.
ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో టెస్లా కార్ల విక్రయాలను ప్రారంభించాలనే యోచనలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది.