LOADING...
Elon Musk: ప్రభుత్వంలో అవినీతిని కట్టడి చేయాలంటే కాంగ్రెస్‌ సభ్యులు,సీనియర్‌ ఉద్యోగుల వేతనాలు పెంచాలి: మస్క్‌ 
ప్రభుత్వంలో అవినీతిని కట్టడి చేయాలంటే కాంగ్రెస్‌ సభ్యులు,సీనియర్‌ ఉద్యోగుల వేతనాలు పెంచాలి: మస్క్‌

Elon Musk: ప్రభుత్వంలో అవినీతిని కట్టడి చేయాలంటే కాంగ్రెస్‌ సభ్యులు,సీనియర్‌ ఉద్యోగుల వేతనాలు పెంచాలి: మస్క్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 28, 2025
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా చట్టసభ అయిన కాంగ్రెస్‌లో అవినీతిని అరికట్టాలంటే, సభ్యుల జీతాలను పెంచాలని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ సూచించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. ''కాంగ్రెస్‌ సభ్యులు,సీనియర్‌ ఉద్యోగులు అవినీతికి లోనయ్యే పరిస్థితిని నివారించాలంటే, వారి వేతనాలను పెంచడం అవసరం. లేనిపక్షంలో ప్రజలు దీని ఫలితంగా వేల రెట్లు నష్టపోయే అవకాశముంది'' అని మస్క్‌ వ్యాఖ్యానించారు. అయితే, డిసెంబర్‌లో కాంగ్రెస్‌ సమర్పించిన ప్రభుత్వ వ్యయాల బిల్లులో, చట్టసభ సభ్యుల వేతనాలను 3.8% లేదా $6,600 డాలర్ల వార్షిక పెంపును నిరాకరించారు. ప్రస్తుతానికి, అమెరికా చట్టసభ సభ్యులు వార్షికంగా $1,74,000 వేతనం అందుకుంటున్నారు, అయితే చివరిసారిగా 2009లోనే దీనిని పెంచారు.

వివరాలు 

చట్టసభ సభ్యులు,ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపులో సింగపూర్‌ ఆదర్శం

తన ప్రతిపాదనపై వస్తున్న విమర్శలను మస్క్‌ ఖండించారు.''ఇది నిరంతరంగా జరిగే వ్యవహారం'' అనే అభిప్రాయాన్ని తప్పుబట్టారు. గతంలో కూడా అమెరికా ప్రభుత్వ సలహాదారులు, కాంగ్రెస్‌ సభ్యులకు వేతన పెంపును సూచించారు. ఇది ప్రతిభావంతులైన ప్రముఖులు ప్రభుత్వ సేవలకు ఆకర్షించడానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. చట్టసభ సభ్యులు,ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపులో సింగపూర్‌ ఆదర్శంగా నిలుస్తోంది. ఆ దేశ మాజీ ప్రధాని లీ కువాన్‌ యూ,ఉద్యోగులకు గౌరవప్రదమైన వేతనాలు అందించడం వల్ల అవినీతి తగ్గించవచ్చని నమ్మారు. ప్రభుత్వ వ్యయాల నియంత్రణ కోసం ట్రంప్‌ ప్రభుత్వం"డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియన్సీ"ని ఏర్పాటు చేసింది. దీని బాధ్యతలను మస్క్‌కు అప్పగించారు.మస్క్‌ అనేక మంది ఉద్యోగులను తొలగించాల్సిందిగా సిఫార్సు చేయడంతో పాటు,అత్యుత్తమంగా పనిచేసేవారిని ఉన్నత పదవులకు నియమిస్తానని స్పష్టం చేశారు.