Donald Trump: డొనాల్డ్ ట్రంప్ విమానం అత్యవసర ల్యాండింగ్.. త్రుటిలో తప్పిన ముప్పు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు త్రుటిలో మరోసారి ముప్పు తప్పింది. మొన్నటి వరకు హత్యాయత్న నుంచి త్రుటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే.
రిపబ్లిక్ అభ్యర్థిగా పెన్సిల్వేనియాలోని బట్లర్ లో ఏర్పాటు చేసిన ర్యాలీలో అతనిపై కాల్పులు జరిగాయి. ఈ ప్రమాదంలో ఆయన కుడి చెవికి బుల్లెట్ తగిలింది.
ఈ ఘటన నుంచి ఆయన ప్రాణప్రాయం నుంచి బయట పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తాజాగా మోంటానా స్టేట్‌లోని బోజ్‌మన్‌లో ఏర్పాటు చేసిన ర్యాలీ పాల్గొనడానికి బయల్దేరిని ట్రంప్ కు పెను ప్రమాదం తప్పింది.
Details
ప్రమాదం జరగలేదని ప్రకటించిన ఎయిర్ పోర్టు స్టాఫ్
ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంలో మెకానికల్ ఇష్యూ తలెత్తడంతో బిల్లింగ్స్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు.
బోజ్ మన్ టౌన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. వెంటనే విమానాన్ని బిల్లింగ్స్ లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు.
అయితే ప్రమాదమేమి జరగలేదని ఎయిర్ పోర్టు స్టాఫ్ ప్రకటించారు.
దీంతో ఆయన ప్రయివేటు వాహనంలో బోజ్మల్‌లో జరిగే ర్యాలీకి వెళ్లనున్నట్లు తెలిసింది.