Page Loader
7నిమిషాల్లో క్యాన్సర్ ట్రీట్‌మెంట్.. కొత్త ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేసిన ఇంగ్లండ్ 
7నిమిషాల్లో క్యాన్సర్ ట్రీట్‌మెంట్.. కొత్త ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేసిన ఇంగ్లండ్

7నిమిషాల్లో క్యాన్సర్ ట్రీట్‌మెంట్.. కొత్త ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేసిన ఇంగ్లండ్ 

వ్రాసిన వారు Stalin
Aug 30, 2023
04:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌లోని వందలాది మంది రోగులకు క్యాన్సర్‌కు చికిత్స చేసే ఇంజెక్షన్‌ను అందించడానికి బ్రిటన్ ప్రభుత్వ సంస్థ జాతీయ ఆరోగ్య సేవ( ఎన్‌హెచ్ఎస్) విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇమ్యునోథెరపీ, అటెజోలిజుమాబ్‌ ద్వారా చికిత్స పొందే వందలాది మంది రోగుల కోసం 'అండర్ ది స్కిన్' ఇంజెక్షన్‌ని అభివృద్ధి చేసినట్లు ఎన్‌హెచ్ఎస్ తెలిపింది. ఈ ఇంజెక్షన్ ప్రక్రియ కేవలం 7 నిమిషాల్లో పూర్తవుతుందని ఎన్‌హెచ్ఎస్ తెలిపింది. ఇలాంటి చికిత్సను ప్రవేశపెట్టిన మొదటి దేశంగా ఇంగ్లండ్ నిలిచింది. తాజాగా బ్రిటన్ మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) 'అండర్ ది స్కిన్' ఇంజెక్షన్‌కి ఆమోదం తెలిపింది. త్వరలోనే 'అండర్ ది స్కిన్' ఇంజెక్షన్‌ ద్వారా చికిత్సను ప్రారంభించనున్నారు.

బ్రిటన్

ఎక్కువ మంది రోగులకు చికిత్స చేసే అవకాశం

'అండర్ ది స్కిన్' ఇంజెక్షన్‌‌ను ఆమోదించడం ద్వారా రోజంతా ఎక్కువ మంది రోగులకు చికిత్స చేయడానికి వీలవుతుందని వెస్ట్ సఫోల్క్ ఎన్‌హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్‌లోని కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అలెగ్జాండర్ మార్టిన్ చెప్పారు. ఇంతకుముందు క్యాన్సర్ రోగులకు టెసెంట్రిక్ అని కూడా పిలువబడే అటెజోలిజుమాబ్ డ్రగ్‌ను ఇంట్రావీనస్ ద్వారా వారి సిరల్లోకి నేరుగా పంపించేవారు. ఈ పద్ధతి కనీసం 30 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఈ పద్దతి ద్వారా సిరను గుర్తించడం కొందరు రోగులు విషయంలో చాలా ఆలస్యం అవుతుంది. అలాంటి వారికి చికిత్స 30 నిమిషాల నుంచి ఒక గంట సమయం పట్టవచ్చు. ఇంట్రావీనస్ పోలిస్తే 'అండర్ ది స్కిన్' చాలా తక్కువ సమయం తీసుకుంటుంది. కేవలం 7నిమిషాల్లో చికిత్స పూర్తవుతుంది.